బోయపాటి వల్ల ‘వినయ విధేయ రామ’ కు దెబ్బ పడనుందా?
రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన పక్క మాస్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’ మరో కొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే టీజర్, [more]
;
రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన పక్క మాస్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’ మరో కొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే టీజర్, [more]
రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన పక్క మాస్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’ మరో కొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే టీజర్, ట్రైలర్స్ లో మరీ మాస్ మసాలా ఎక్కువయిందనే కంప్లయింట్స్ వస్తున్నా…బయ్యర్లు ఆందోళన చెందుతున్న, బోయపాటి తన రూట్ మార్చలేదు. దీన్ని మాస్ సినిమాగానే ప్రమోట్ చేయాలనీ చూస్తున్నాడు.
నిజానికి టైటిల్ డిసైడ్ చేసినప్పుడే ‘జయ జానకీ నాయక’ మాదిరిగా ఫ్యామిలీ సినిమా అన్నట్టు ప్రమోట్ చేద్దామనే అనుకున్నాడట. కానీ ఎందుకో టీజర్ కి ముందు తన మనసు మార్చుకుని మాస్ మూవీ గానే చూపించాలని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇందులో యాక్షన్ ఎలెమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు ఇదేంటి ఇలా ఉంది అనకూడదని..ముందుగానే ఈసినిమా ఇలా వుండబోతుందనే థియేటర్స్ కి రావాలని బోయపాటి భావించి ఇలా చేసాడట.
ఫామిలీ టచ్ ఉన్న ఈసినిమా చూడడానికి ఫ్యామిలీస్ ఇష్టపడరు. యాక్షన్ లోడెడ్ పోస్టర్లు మాత్రమే ఏరి కోరి వదులుతున్నాడు బోయపాటి. ఫ్యామిలీ కి సంబంధించి రెండుమూడే వదిలాడు కానీ సినిమాపై హైప్ తెపించే అవకాశం లేదు. దాంతో ఫ్యామిలీస్ తో పాటు ఒక వర్గం ప్రేక్షకులు ఈసినిమా కి పూర్తి గా దూరం అయ్యే అవకాశముందని. బి,సి సెంటర్స్ లో అయితే ఈసినిమాకు డోకాలేదు కానీ ఏ సెంటర్స్ లోనే ఎలా అనేది చూడాలి