వర్మ కి కోపం వచ్చింది.. అందుకే నడి రోడ్డు మీద ప్రెస్ మీట్
వర్మ కి వివాదాలు కొత్తేమి కాదు. లేటెస్ట్ గా అతను తెరకెక్కించిన మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎన్నో విమర్శలు మధ్య ఆంధ్ర లో తప్ప అన్ని చోట్ల [more]
;
వర్మ కి వివాదాలు కొత్తేమి కాదు. లేటెస్ట్ గా అతను తెరకెక్కించిన మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎన్నో విమర్శలు మధ్య ఆంధ్ర లో తప్ప అన్ని చోట్ల [more]
వర్మ కి వివాదాలు కొత్తేమి కాదు. లేటెస్ట్ గా అతను తెరకెక్కించిన మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎన్నో విమర్శలు మధ్య ఆంధ్ర లో తప్ప అన్ని చోట్ల రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ఈమూవీ ని టీడీపీ వాళ్లు ఆపడానికి చాలా ట్రై చేసారు కానీ చివరికి తెలంగాణాలో రిలీజ్ అయిపోయింది. ఆంధ్ర లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈసినిమా అక్కడ రిలీజ్ కాలేదు.
అయితే ఆంధ్ర లో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో మే 1 న ఈసినిమా రిలీజ్ చేస్తున్నట్టు వర్మ ట్వీటర్ లో ప్రటించారు. దానికి సంబంధించి రాం గోపాల్ వర్మ ఆదివారం విజయవాడ నోవాటెల్ హోటల్‌లో ప్రెస్‌మీట్ పెడతానని వర్మ మొదట ప్రకటించాడు. అయితే నోవాటెల్ హోటల్ వారికి ఎవరో వార్నింగ్ ఇవ్వడం వల్ల భయంతో వారీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేశారని, ఈ పరిస్థితుల్లో ఎంత ప్రయత్నించినా మనందరికీ తెలిసిన ఓ వ్యక్తి భయంతో హోటళ్ళు, క్లబ్బుల వాళ్ళు జడిసి పారిపోయారని వర్మ పేర్కొన్నాడు.
దాంతో హర్ట్ అయినా వర్మ లేటెస్ట్ గా వెన్యూ ని విజయవాడ పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నడిరోడ్డు మీద దీన్ని నిర్వహిస్తానని తన ట్విటర్‌లో ఆయన పేర్కొన్నాడు. సాయంత్రం 4 గంటలకు ఈ ప్రెస్‌మీట్ ఉంటుందని అందరు రావాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. మరి నడి రోడ్ మీద ప్రెస్ మీట్ అంటే ఆంధ్ర పోలీస్ వారు పర్మిషన్ ఇస్తారో లేదో చూడాలి.