బోయపాటిని బ్లేమ్ చేసినట్టేనా..!

వినయ విధేయ రామపై ఇప్పటివరకు మాట్లాడకుండా కామ్ గా ఉన్న రామ్ చరణ్ ఉన్నట్టుండి.. ఒక ప్రెస్ నోట్ విడుదల చెసి సినిమా ఫలితంపై ఫీలవుతున్నామని చెప్పాడు. [more]

Update: 2019-02-05 11:51 GMT

వినయ విధేయ రామపై ఇప్పటివరకు మాట్లాడకుండా కామ్ గా ఉన్న రామ్ చరణ్ ఉన్నట్టుండి.. ఒక ప్రెస్ నోట్ విడుదల చెసి సినిమా ఫలితంపై ఫీలవుతున్నామని చెప్పాడు. రామ్ చరణ్ గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే సినిమా అభిమానుల అంచనాలు అందుకోలేకపోవడానికి కారణం ఏమిటనేది రామ్ చరణ్ ఆ నోట్ లో ఎక్కడా చెప్పలేదు. అయితే సినిమాలు పోయినా ఎవ్వరు దాని గురించి స్పందించే సాహసం చెయ్యరు. కానీ రామ్ చరణ్ చేసాడు. అయితే రామ్ చరణ్ ఆ ప్రెస్ నోట్ లో ఎక్కడా దర్శకుడు బోయపాటి పేరుని ప్రస్తావించలేదు. వినయ విధేయ రామ టాక్ తో బోయపాటి ఇంతవరకు ఎక్కడా ఫోకస్ కాలేదు. ఈ మధ్యన బోయపాటి అండర్ గ్రౌండ్ లో కూర్చుని బాలకృష్ణ సినిమా కోసమా స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడనే టాక్ బాగా వినబడింది.

బోయపాటిపై ఆగ్రహంగా ఉన్నారా…?

మరి బోయపాటి, చరణ్ లు కలిసి సినిమా ఫలితంపై స్పందిస్తే బాగుండేది. ఇలా చరణ్ ఒక్కడే స్పందించడంతో బోయపాటి ఇరుకున పడ్డాడు. ఒక విధంగా రామ్ చరణ్ బోయపాటిని బ్లేమ్ చేసాడనిపిస్తుంది. ఎడాపెడా ఖర్చు పెట్టించి నిర్మాతలను నిండా ముంచాడని… అలాగే అవసరానికి మించి సినిమాలో యాక్షన్ నింపేసాడని.. ఇంకా చాలా విషయాల్లో బోయపాటి మీద మెగా ఫ్యామిలీ గుర్రుగా ఉందంటున్నారు. అందుకే రామ్ చరణ్ నిర్మాత దానయ్య పేరుని ప్రెస్ నోట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించి.. బోయపాటి పేరు ఎక్కడా రాకుండా చూసుకున్నాడని అంటున్నారు. మరి సినిమా పోవడానికి దర్శకుడే బాధ్యత వహించాలి కానీ.. హీరో కాదు. అయినా రామ్ చరణ్ ఎంతో ధైర్యంతో మీడియాకి ఇలా లేఖ రూపంలో తన సినిమా ఫలితమై స్పందించాడు.

Tags:    

Similar News