మాస్టర్ చూసాక బెదిరిపోతున్నారు!

మెగా హీరో రామ్ చరణ్ RRR తర్వాత చెయ్యబోయే ప్రాజెక్ట్ విషయమై క్లారిటీ ఇవ్వకుండా మెగా ఫాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ [more]

;

Update: 2021-01-14 14:58 GMT
Lokesh Kanakaraj Ramcharan
  • whatsapp icon

మెగా హీరో రామ్ చరణ్ RRR తర్వాత చెయ్యబోయే ప్రాజెక్ట్ విషయమై క్లారిటీ ఇవ్వకుండా మెగా ఫాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం RRR తర్వాత రామ్ చరణ్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నాడని.. తమిళ హిట్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రామ్ చరణ్ ని కలిసి తన దగ్గరున్న కథతో ఇంప్రెస్స్ చెయ్యడం.. మాస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ తో సినిమా ఉండబోతున్నట్లుగా లోకేష్ కనకరాజ్ హింట్ ఇవ్వడంతో మెగా ఫాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కారణం లోకేష్ కనకరాజ్ ఖైదీ తో భారీ హిట్ కొట్టాడు. అలాగే విజయ్ తో మాస్టర్ భారీ సినిమా చేసాడు. ఇక కమల్ తో విక్రమ్ సినిమా చేస్తున్నాడు.. అని చరణ్ ఫాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

కానీ మెగా ఫాన్స్ ఆనందం ఆవిరైపోయింది. వాళ్ళు లోకేష్ కనకరాజ్ పై పెట్టుకున్న నమ్మకాన్ని మాస్టర్ సినిమాతో ఆయన వమ్ము చేసాడు. విజయ్ తో లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ నిన్న విడుదలై సో సో టాక్ తెచ్చుకోవడంతో మెగా ఫాన్స్ కి వెన్నులో ఒణుకు మొదలయ్యింది. రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో తొందర పడి ఓ నిర్ణయానికి వస్తే లోకేష్ కనకరాజ్ దెబ్బేయ్యడం ఖాయం.. కనక మాస్టర్ రిజెల్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు చరణ్ బాగా ఆలోచించాకే లోకేష్ కనకరాజ్ కి ఓకె చెబితే బావుంటుంది. ఎలాగూ లోకేష్ తో అధికారిక ప్రకటన కూడా రాలేదు. సో ఇప్పుడే లోకేష్ కనకరాజ్ విషయంలో రామ్ చరణ్ ఆలోచిస్తే బావుంటుంది అంటూ మెగా ఫాన్స్ చరణ్ కి రీక్వెస్ట్ లు పెడుతున్నారట.

Tags:    

Similar News