రామ్ చరణ్ ఏం కావాలో క్లారిటీ ఉందా?

రామ్ చరణ్ ప్రస్తుతం RRR షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ RRR తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ [more]

;

Update: 2020-10-14 08:49 GMT
కరోనా
  • whatsapp icon

రామ్ చరణ్ ప్రస్తుతం RRR షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ RRR తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత చిరు ఆచార్య లో చరణ్ ఓ రోల్ చెయ్యాల్సి ఉంది. చరణ్ డేట్ కోసం కాజల్ పెళ్లి కోసం ఆగిన ఆచార్య షూటింగ్ ఎప్పుడు మొదలెడదామా అని కొరటాల కాచుకుని కూర్చున్నాడు. మరి ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఇంతవరకు ప్రకటించలేదు. తన వద్దకు వచ్చే కథలతో తండ్రి చిరు తో సినిమాలు చేసేస్తున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ కి ఓ పట్టాన కథలు నచ్చడం లేదు. ఎంతమంది దర్శకులు రామ్ చరణ్ కి కథ చెప్పినా చరణ్ నో చెప్పేస్తున్నాడు.

తాజాగా మరో దర్శకుడి కథకి చరణ్ నో చెప్పాడని టాక్ నడుస్తుంది. అతనే భీష్మ సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకీ కుడుములు. భీష్మ తర్వాత చిరు ద్వారా చరణ్ ని కలిసి కథ వినిపించిన వెంకీ కుడుములు చరణ్ హోల్డ్ లో పెట్టాడు. తాజాగా వెంకీ ని లైట్ తీసుకోమని, వేరే హీరోని చూసుకోమని చరణ్ సంకేతాలిచ్చినట్టుగా ఫిల్నగర్ టాక్. దానితో హిట్ కొట్టిన స్టార్ హీరో దొరకలేదని వెంకీ కుడుములు ఫీలవుతుంటే.. మరోపక్క రామ్ చరణ్ నెక్స్ట్ మూవీకి ఎలాంటి కథ కావాలో, అసలు ఏ జోనర్ అయితే చరణ్ ఒప్పుకుంటాడు, ఎలాంటి కథ చరణ్ కి వినిపిస్తే.. వర్కౌట్ అవుతుంది అంటూ దర్శకులు కిందా మీద అవుతున్నారట.

Tags:    

Similar News