ఖైదీ దర్శకుడితో చరణ్?

RRR తర్వాత రామ్ చరణ్ సినిమాపై ఇంకా సందిగ్దత కొనసాగుతోనే ఉంది. రామ్ చరణ్ ఆచార్య లో ప్రత్యేక పాత్ర చేసాక మరో దర్శకుడికి మాటివ్వలేదు. ఏ [more]

Update: 2020-08-06 13:14 GMT

RRR తర్వాత రామ్ చరణ్ సినిమాపై ఇంకా సందిగ్దత కొనసాగుతోనే ఉంది. రామ్ చరణ్ ఆచార్య లో ప్రత్యేక పాత్ర చేసాక మరో దర్శకుడికి మాటివ్వలేదు. ఏ కథని ఓకె చెయ్యనూ లేదు. ఈలోపు రామ్ చరణ్ వంశి పైడిపల్లితో అయినా, లేదంటే కొత్త దర్శకుడు గోపాల కృష్ణ తో అయినా, అది కాదు అంటే భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో అయినా సినిమా చేస్తాడనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. ఒకపక్క హీరోలంతా సినిమాల మీద సినిమాలు కమిట్ అవుతుంటే రామ్ చరణ్ మాత్రం మాట్లాడడం లేదు. అయితే తాజాగా రామ్ చరణ్ ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్.

ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం స్టార్ హీరో విజయ్ తో మాస్టర్స్ సినిమా చేసాడు. ఆ సినిమా కరోనా కారణంగా విడుదలకు నోచుకోవడం లేదు. అయితే ఈలోపు లోకేష్ కనకరాజ్ ని టాలీవుడ్ మైత్రి మూవీస్ వెళ్లి లాక్ చేసినట్లుగా చెబుతుంటే… రంగస్థలంక్ తరవాత రామ్ చరణ్ మరో మూవీని మైత్రి వారికీ చేస్తా అని చెప్పడంతో.. ఇప్పుడులోకేష్ కనకరాజ్ తో రామ్ చరణ్ ని లింక్ చెయ్యడానికి మైత్రి మూవీస్ ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్. మరి లోకేష్ కనకరాజ్ పాన్ ఇండియా లెవల్ కి సరిపోయే కథతో రామ్ చరణ్ ని ఇంప్రెస్స్ చెయ్యగలిగితే పక్కాగా లోకేష్ – మైత్రి – రామ్ చరణ్ కాంబో మూవీ పట్టాలెక్కడం ఖాయమే.

Tags:    

Similar News