Animal Movie Review : రణబీర్ కపూర్ యానిమల్ మూవీ రివ్యూ ఏంటి..?

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. రణబీర్ కపూర్ తో తెరకెక్కించిన యానిమల్ మూవీ రివ్యూ ఏంటి..?

Update: 2023-12-01 09:52 GMT

Animal Movie Review : అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. అదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇప్పుడు తన రెండో చిత్రంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి 'యానిమల్' తెరకెక్కించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు.

సందీప్ వంగా తెరకెక్కించిన సినిమా కావడం, ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఓ రేంజ్ లో ఉన్నడంతో తెలుగులో కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి నేడు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ మూవీ టాక్ ఏంటి..? ఆడియన్స్ అంచనాలను అందుకుందా..? ఆడియన్స్ ఏమంటున్నారు..?
కథ ఏంటంటే..
ఇండియాలోని టాప్ బిజినెస్ మెన్ అయిన హీరో తండ్రి తన బిజీ లైఫ్ వల్ల తన పిల్లల పై సరైన ప్రేమ చూపించలేకపోతాడు. కానీ హీరో మాత్రం నాన్న పై పిచ్చి ప్రేమని పెంచుకుంటాడు. అలాంటి హీరో చిన్నప్పుడు ఒక చిన్న తప్పు చేయడంతో.. తనని చదువు అని చెప్పి దూరంగా పంపించేస్తాడు. ఆ తరువాత హీరోయిన్ తో ప్రేమ పెళ్లి, అదికూడా ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడంతో తండ్రికి దూరంగానే ఉంటాడు హీరో.
కానీ కొన్నాళ్ళకు హీరో ఫాదర్ మీద ఎవరో ఎటాక్ చేస్తారు. అది తెలుసుకున్న హీరో తిరిగి వచ్చి.. నాన్న మీద పిచ్చి ప్రేమతో ఆ ఎటాక్ చేసినవాడు కోసం ఒక విధ్వంసం సృష్టిస్తాడు. సింపుల్ గా ఇదే కథ. ఇక సినిమా మధ్యలో ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేయించే యాటిట్యూడ్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ ని విజుల్స్ వేయిస్తాయి.
సినిమా విశ్లేషణ..
అర్జున్ రెడ్డి మూవీలోని లవ్ స్టోరీ అంతకుముందు చాలా సినిమాల్లో వచ్చాయి. కానీ అర్జున్ రెడ్డిలో సందీప్ చూపించిన విధానం అందర్నీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఒక ఎమోషన్ ని ఇలానే చూపించాలి అనే దానికి బ్రేక్ చేస్తూ అర్జున్ రెడ్డి ఎలా తెరకెక్కించారో.. యానిమల్ మూవీలో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ని కూడా అలానే చూపించారు. తండ్రి కొడుకుల అనుబంధాన్ని చాలా వైలెంట్ గా చూపించి ఇప్పుడు యూత్ కి నచ్చేలా చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీసిన సందీప్.. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్లు ఉంటుంది. కానీ మూడున్నర గంటలపాటు ప్రేక్షకులను థియేటర్ లో కూర్చోబెట్టడంలో దర్శకుడు సక్సెస్ సాధించాడు అనే చెప్పాలి.
తెలుగు పోస్ట్ రేటింగ్ : 3/5
నోట్ - ఈ మూవీ రివ్యూ మరియు రేటింగ్.. విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..

Full View

Tags:    

Similar News