రష్మిక లక్ ఏ రేంజ్ లో ఉందో చూశారా..?

అందం, ఆకర్షణ ఉన్నా నటనలో నైపుణ్యమున్నా.. హీరోయిన్స్ కు లక్ అనేది ఎంత అవసరమో చాలామంది హీరోయిన్స్ విషయంలో చూస్తూనే ఉన్నాం. అందం ఓ అన్నంత మాత్రమే [more]

;

Update: 2019-05-24 10:53 GMT
rashmika mandanna on her acting
  • whatsapp icon

అందం, ఆకర్షణ ఉన్నా నటనలో నైపుణ్యమున్నా.. హీరోయిన్స్ కు లక్ అనేది ఎంత అవసరమో చాలామంది హీరోయిన్స్ విషయంలో చూస్తూనే ఉన్నాం. అందం ఓ అన్నంత మాత్రమే ఉన్నా… లక్కు, ఆకర్షణ, నటనలో నైపుణ్యం టన్నుల లెక్కన ఉండడంతో కన్నడ భామ రష్మిక మందాన్నాకి అవకాశాల మీద అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇటు తెలుగు, అటు తమిళం, కన్నడలోనూ రష్మిక జోరు మాములుగా లేదు. తెలుగులో క్రేజీ హీరో విజయ్ తో నటిస్తున్న రష్మికకు… నితిన్ సరసన, అటు మహేష్ సినిమాలో ఆఫర్ వచ్చింది.

స్టార్ హీరో సినిమాలో ఛాన్స్

ఇక తమిళనాట కార్తీ సినిమాతో అడుగుపెట్టిన రష్మికకు మరో క్రేజీ ఆఫర్ వచ్చిందట. అది కూడా ఇళయ దళపతి విజయ్ 64లో విజయ్ సరసన అవకాశమొచ్చిందట. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రష్మికను మెయిన్ హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రస్తుతం ఆమెతో చర్చలు సాగుతున్నాయట. మరి కార్తీతో నటిస్తున్న తమిళ మూవీ ఇంకా విడుదల కాకుండానే రష్మికకు ఇలా స్టార్ హీరో విజయ్ సరసన ఆఫర్ రావడం మాత్రం రష్మిక లక్కుకు నిదర్శనం. తెలుగు, తమిళ, కన్నడ ఆఫర్స్ తో బాగా బిజీగా ఉన్న రష్మికను లక్కున్న హీరోయిన్ అనడంలో అతిశయోక్తి లేనేలేదు.

Tags:    

Similar News