స్విమ్ సూట్ లో రష్మిక.. మాల్దీవుల్లో రచ్చ

Update: 2022-10-10 02:21 GMT

ప్రస్తుతం దేశంలో అత్యంత పాపులర్ అయిన స్టార్లలో ఒకరైన రష్మిక మందన్న విహారయాత్రలో భాగంగా మాల్దీవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కన్నడ బ్యూటీ తన టూర్ నుండి పలు ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా రష్మిక ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. ఆమె స్విమ్‌సూట్‌తో స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. దక్షిణాదిన మంచి హిట్స్ తో దూసుకుపోతున్న రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. అమితాబ్ బచ్చన్ తో 'గుడ్‌బై' సినిమాలో కలిసి నటించింది. అక్టోబర్ నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి ఎమోషనల్ సినిమా అనే పేరును తెచ్చుకుంది.

ఆమె తన స్నేహితుడు విజయ్ దేవరకొండతో కలిసి మాల్దీవులకు వెళ్లినట్లు సమాచారం. తాజాగా వీరిద్దరూ విహారయాత్రకు వెళుతూ ముంబై విమానాశ్రయంలో కనిపించారు. వారు కలిసి ఫోటోలు ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు.
రష్మిక చివరిసారిగా బాలీవుడ్‌ సినిమా గుడ్‌బైలో కనిపించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె రణబీర్ కపూర్ తో యానిమల్, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాల్లో చేస్తోంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న మిషన్ మజ్నులో కూడా ఉంది. తమిళంలో ఇళయదళపతి విజయ్ తో కలిసి నటిస్తూ ఉంది.


Similar News