అనుకున్నట్టే జరిగింది
అనుకున్నట్టే ఈ వారం రవి ఎలిమినేట్ అయ్యాడు. రెండు రోజుల ముందుగానే ఈ న్యూస్ బయటకు రావడంతో ఈ రోజు జరిగిన ఎలిమినేషన్ ని పెద్దగా ఎవరూ [more]
;
అనుకున్నట్టే ఈ వారం రవి ఎలిమినేట్ అయ్యాడు. రెండు రోజుల ముందుగానే ఈ న్యూస్ బయటకు రావడంతో ఈ రోజు జరిగిన ఎలిమినేషన్ ని పెద్దగా ఎవరూ [more]
అనుకున్నట్టే ఈ వారం రవి ఎలిమినేట్ అయ్యాడు. రెండు రోజుల ముందుగానే ఈ న్యూస్ బయటకు రావడంతో ఈ రోజు జరిగిన ఎలిమినేషన్ ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నామినేషన్ లో వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, రవి ఉన్న సంగతి తెలిసిందే. అయితే మొన్న శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ కి క్లాస్ తీసుకున్న తరువాత ఎపిసోడ్ చివరిలో వరుణ్ సందేశ్ ని సేవ్ చేశాడు. దాంతో నిన్న శ్రీముఖి, బాబా భాస్కర్, రవి మిగిలారు. సండే ఫన్ డే కావడంతో నాగార్జున హౌస్ మేట్స్ తో కొన్ని ఫన్నీ టాస్కులు చేయించి మధ్య శ్రీముఖి ని సేవ్ చేశాడు. ఇక మిగిలింది బాబా భాస్కర్ అండ్ రవి. ఇక షో చివరిలో ఇద్దరిలో బాబాని సేవ్ చేసి రవిని ఎలిమినేట్ చేసాడు.
హార్ట్ అవుతున్న ఫాన్స్….
ఇక ఎప్పటిలానే శివజ్యోతి ఎమోషనల్ అయింది. రవి వెళ్తూ వెళ్తూ పునర్నవి పై బిగ్ బాంబు వేసి వెళ్ళాడు. అది ఏటంటే…హౌస్ లో ఎవరి బట్టలు అయినా పునర్నవి ఉతకాల్సి ఉంటుంది. అంత చిన్ని చేతులకి ఎంత పెద్ద పనో అని పునర్నవి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.