మాధవన్ తెలుగు హీరో కాకపోయినా.. మాధవన్ అంటే తెలుగులో మంచిక్రేజ్ ఉంది. అయితే ఎప్పుడూ డబ్బింగ్ సినిమాలతో అలరించే మాధవన్ మొదటిసారి ఒక తెలుగు స్ట్రెయిట్ మూవీ చేశాడు. నాగ చైతన్య - చందు మొండేటి సవ్యసాచి సినిమాలో మాధవన్ నెగెటివ్ రోల్ పోషించాడు. మైండ్ గేమ్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు. ఇక మాధవన్ తెలుగు స్ట్రయిట్ సినిమాలకు టాటా చెప్పేస్తాడేమో అనుకున్నారు అంతా. కానీ మాధవన్ మరోసారి తెలుగు స్ట్రయిట్ సినిమా చేయబోతున్నాడట. దాదాపుగా మాధవన్ తెలుగులో సెకండ్ ఎంట్రీ ఖాయంగానే కనబడుతుంది.
మాధవన్ కోసం స్క్రిప్ట్ మార్పు
రవితేజ - వీఐ ఆనంద్ కాంబోలో తెరకెక్కబోతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో మాధవన్ ని విలన్ రోల్ కోసం సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన రవితేజ - విఐ ఆనంద్ ల సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులతో మరికొద్దిగా టైం పట్టేలా ఉందంటున్నారు. మొదటి కథలో మాధవన్ ని విలన్ పాత్రకి అనుకోలేదని.. కానీ మాధవన్ నెగెటివ్ రోల్ చేస్తే సినిమాకి క్రేజ్, భారీ హైప్ వస్తుంది గనుక మాధవన్ ని ఈ ప్రాజెక్టు లోకి చేర్చడంతో.. స్క్రిప్ట్ లో మాధవన్ క్యారెక్టర్ కి అనుగుణం గా మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఇక మాధవన్ కూడా దాదాపు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లనే స్క్రిప్ట్ లో మార్పులు మొదలయినట్లుగా తెలుస్తుంది. నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని, టచ్ చేసి చూడు సినిమాల డిజాస్టర్స్ తో ఉన్న రవితేజ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కబోయే సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.