టైగర్ నాగేశ్వరరావు మూవీని ఆపేయాలి.. నిరాహార దీక్ష చేస్తున్న..

రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. మూవీ చిత్రకరణను ఆపేయాలి, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామంటూ..

Update: 2023-09-08 12:34 GMT

రవితేజ (Raviteja) నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ.. 19వ శతాబ్దంలోని ఆంధ్రప్రదేశ్ స్టూవర్టుపురం ప్రాంతంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు లైఫ్ స్టోరీ నేపథ్యంతో రాబోతుంది. కొత్త డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.

ఈక్రమంలోనే మూవీ నుంచి టీజర్ అండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాకి ఇబ్బందులు ఎదురయ్యాయి. స్టువర్టుపురం గ్రామ ప్రజల గౌరవాన్ని, ఎరుకల సామాజికవర్గ మనోభావాలను దెబ్బతీసేలా చిత్రం తెరకెక్కుతోందని ఏపీ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు అవ్వడం, న్యాయమూర్తి సినిమా ప్రొడ్యూసర్ కి నోటీసులు పంపించడం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ వివాదం మరింత పెద్దది అయ్యింది.
ఎరుకల జాతి వ్యక్తి అయిన టైగర్ నాగేశ్వర రావుని ఒక భయంకరమైన దొంగ చూపిస్తూ ఎరుకల జాతిని, స్టువర్టుపురం ఊరుని నేర రాజధానిగా చూపిస్తూ గ్రామా ప్రజలను అవమానపరిచేలా సినిమాని తెరకెక్కిస్తున్నారని ఎరుక జాతి వ్యక్తులు, స్టువర్టుపురం గ్రామ ప్రజలు విజయవాడలో నిరాహార దీక్షని మొదలుపెట్టారు. సినిమా తీసేముందు ఎరుకల జాతి వారిని, గ్రామా ప్రజలని చిత్ర యూనిట్ సంప్రదించలేదని, చిత్రం వల్ల తమకి ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు.
టైగర్ నాగేశ్వరరావు మూవీ చిత్రకరణను ఆపేయాలి, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామంటూ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్యతో టైగర్ నాగేశ్వరరావుకి తీవ్ర ఇబ్బంది ఎదురయ్యినట్లు అయ్యింది. మరి మూవీ టీం ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ ఈ మూవీలో నటిస్తున్నారు. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.


Tags:    

Similar News