రవితేజ ఫెయిల్ అవడానికి కారణం ఇదే..?

Update: 2018-12-10 09:01 GMT

మొన్నటివరకు మినియం గ్యారంటీగా ఉన్న రవితేజ కొన్ని సినిమాల నుండి ఆ టాగ్ లైన్ పోగొట్టుకున్నాడు. దానికి కారణం రవితేజనే. అవును రవితేజ తన సినిమాల స్టోరీ ల సెలక్షన్ విషయంలో ఫెయిల్ అవుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాలో అసలు కథ ఏమి ఉందని ఓకే చేసాడు? కేవలం శ్రీను వైట్ల డైరెక్టర్ అని, పెద్ద ప్రొడక్షన్ హౌస్ అని ఓకే చేసేసాడు. కేవలం పారితోషికం లెక్కలు మాత్రమే చూసుకుంటాడనే విమర్శలు రవి పైన బాగా ఉన్నాయి.

టైటిల్... స్క్రిప్ట్ లో మార్పులు...

అంతకు ముందు చిత్రాల విషయంలోనూ అదే పరిస్థితి. 'నేల టికెట్టు', 'టచ్ చేసి చూడు' కథలు అసలు బాగాలేవు. రెమ్యూనరేషన్ కోసమే ఈ సినిమాలు చేశాడని టాక్ ఉంది. అందుకే ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నాడు. విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ పాటికే మొదలు కావాల్సినా వాయిదా వేసినట్టు తెలిసింది. స్క్రిప్ట్ పరంగా చాలా మార్పులు చేయిస్తున్నట్టు తెలుస్తుంది. రవితేజ కొన్ని కీలకమైన మార్పులు ఆనంద్ కు చెప్పాడట అవి మార్చే పనిలో ఉన్నాడు ఆనంద్. ఈ మూవీకి 'డిస్కో కింగ్' అనే టైటిల్ అనుకున్నట్టు సమాచారం. అయితే టైటిల్ చాలా అవుట్ డేటెడ్ గా ఉందని కామెంట్స్ రావడంతో టైటిల్ ని మార్చే పనిలో ఉన్నారట.

జాగ్రత్త పడుతున్న రవితేజ

'అమర్ అక్బర్ అంటోనీ' మరీ దారుణంగా 6 కోట్ల షేర్ తో క్లోజ్ అయ్యింది. అంతకు ముందు వచ్చిన రెండు సినిమాల పరిస్థితి కూడా ఇంతే. దీంతో రవితేజ అలెర్ట్ గా ఉండాలని నిర్ణయించుకున్నాడట. రవి మార్కెట్ కూడా దారుణంగా డ్యామేజ్ అవ్వడంతో కొంచం స్లో అండ్ స్టడీ గా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితిలో ఆనంద్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అవ్వాలని ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా కోరుకుంటున్నారు.

Similar News