నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు : పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు

తాజాగా నా ఇష్టం సినిమాను ఆపివేయాలంటూ వేసిన పిటిషన్ పై ఆర్జీవీ స్పందించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు..

Update: 2022-05-28 12:24 GMT

హైదరాబాద్ : ప్రముఖ వివాదాస్పద దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన డేంజరస్ సినిమాను తెలుగులో మా ఇష్టం అనే టైటిల్ తో తెలుగులో విడుదల కావాల్సింది. కానీ.. నట్టి ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు చెందిన నట్టి క్రాంతి, నట్టి కరుణలు ఆర్జీవీ తమకు డబ్బులు ఇవ్వాలని, ఇవ్వకుండా సినిమాను రిలీజ్ చేస్తున్నారంటూ కోర్టులో కేసు వేసి స్టే తీసుకొచ్చి సినిమాను ఆపేశారు. ప్రస్తుతం దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది.

తాజాగా నా ఇష్టం సినిమాను ఆపివేయాలంటూ వేసిన పిటిషన్ పై ఆర్జీవీ స్పందించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి, కోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ.. నట్టి క్రాంతి, కరుణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. "నట్టి క్రాంతి, నట్టి కరుణ అనే ఇద్ద‌రు వ్య‌క్తులు నా డాక్యుమెంట్స్ ఫోర్జ‌రీ చేసి, దొంగ సంత‌కం, దొంగ లెట‌ర్ హెడ్‌తో మా సినిమాపై స్టే తెచ్చారు. అదేంటో నేను ప‌రిశీలిస్తే వారు నా సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేశార‌ని తెలిసింది. ఆ ఫోర్జ‌రీ కేసుకి సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాను. ఆ సంత‌కం నాది కాదు. పైగా లెటర్ హెడ్ పై కంపెనీ అడ్రస్ పంజాగుట్ట అని ఉంది. కానీ.. నా కంపెనీ అడ్రస్ శ్రీనగర్ కాలనీలో ఉంటుంది. ఈ కేసుకు సంబంధించినంతవరకూ నట్టికుమార్ ఎవరో నాకు తెలియదు. నట్టి క్రాంతి, కరుణపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాను." అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.




Tags:    

Similar News