రేపు ఆర్ఆర్ఆర్ నుంచి 4వ పాట.. కొమురం భీముడో టీజర్ !

తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేయనున్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ లు ట్విట్టర్ వేదికగా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు.;

Update: 2021-12-23 06:30 GMT
రేపు ఆర్ఆర్ఆర్ నుంచి 4వ పాట.. కొమురం భీముడో టీజర్ !
  • whatsapp icon

భారీ అంచనాల జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే పలు టీజర్లు రాగా.. మూడు పాటలను విడుదల చేశారు మేకర్స్. దోస్తీ, నాటు నాటు పాటలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేయనున్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ లు ట్విట్టర్ వేదికగా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. కొమురం భీముడో.. కొమురం భీముడో అంటూ సాగే ఈ పాటను సింగర్ కాలభైరవ ఆలపించగా.. ఇదొక ఎమోషనల్ సాంగ్ అని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎమోషనల్ ట్రాక్ మీద వచ్చే పాట ఇదేనని, ఈ పాట మీ అందరికీ చాలా కాలం గుర్తుండిపోతుందని తారక్, చరణ్ లు తెలిపారు. డిసెంబర్ 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నారు మేకర్స్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ తో తెరకెక్కుతోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం దర్శకుడితో పాటు కథానాయకులిద్దరూ ఎంత కష్టపడ్డారో టీజర్లలోనే చూపించారు రాజమౌళి.
Full View


Tags:    

Similar News