అంత బడ్జెట్ లో 12 కోట్లు తక్కువే కదా..?

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న #RRR మూవీ బడ్జెట్ సుమారు 350 నుండి 400 కోట్లు అని నిర్మాత దానయ్య ప్రెస్ మీట్ [more]

Update: 2019-03-16 06:33 GMT

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న #RRR మూవీ బడ్జెట్ సుమారు 350 నుండి 400 కోట్లు అని నిర్మాత దానయ్య ప్రెస్ మీట్ లో రివీల్ చేసాడు. అంత భారీ బడ్జెట్ లో నటించడం ఎన్టీఆర్, రామ్ చరణ్ కి మొదటిసారి. కానీ రాజమౌళి ఇలాంటి బడ్జెట్ లోనే బాహుబలి డైరెక్ట్ చేసాడు. #RRR బడ్జెట్ గురించి చెప్పినప్పటి నుండి రాజమౌళి అంత బడ్జెట్ పెట్టి ఆ సినిమాలో ఏం చూపిస్తాడో అనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. మరి నేషనల్ వైడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అంతే క్రేజ్ ఉన్న నటులను ఎంపిక చేస్తున్నాడు రాజమౌళి.

భారీగా పారితోషకం డిమాండ్

రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ చిన్నది అలియా భట్ ని ఎంపిక చేసాడు. మరి గత ఏడాది సూపర్ హిట్స్ తో జోరుమీదున్న అలియా భట్ ఈ ఏడాది బ్రహ్మాస్త్ర, కళంక్‌, సడక్‌ 2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ బాగా బిజీగా ఉంది. అయినా రాజమౌళి #RRR కోసం ఈ చిన్నది టాలీవుడ్ కి వచ్చేసింది. అయితే అంత భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే అలియా భట్ కి ఆ రేంజ్ పారితోషకాలనే అందుకుంటుంది. ఇప్పటివరకు 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న అలియా.. ఇప్పుడు #RRR కోసం 15 కోట్లు డిమాండ్ చేసిందట. మరి పది భాషల్లో విడుదలవుతున్న #RRR సినిమా కోసం అలియా అంత అడగడంలో తప్పులేదంటున్నారు

చివరకు 12 కోట్లకు ఫైనల్

కానీ బేరసారాలు చేసి అలియాకి చివరికి 10 నుండి 12 కోట్ల వరకు సెటిల్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి 350 నుండి 400 కోట్ల బడ్జెట్ లో అలియాకిచ్చే 12 కోట్లు పెద్ద లెక్కలోవి కాదంటున్నారు. భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్ ని తీసుకుంటే ఆ మాత్రం సమర్పించుకొవాల్సిందే. ఇకపోతే ఈ సినిమాలో సముద్ర ఖని, అజయ్ దేవగన్ లాంటి దిగ్గజ నటులు కూడా నటిస్తున్నారు. మరి వారి పారితోషకాలు ఎంతున్నాయో తెలియాల్సి ది. అంతేకాకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్ ల పారితోషకాలు కూడా ఆకాశాన్ని తాకడం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News