#RRR సినిమా అప్ డేట్..!

ఇండియా మొత్తం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ పాపులర్ అయిన జక్కన్న ప్రస్తుతం ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో #RRR అనే చిత్రం [more]

Update: 2019-03-29 11:21 GMT

ఇండియా మొత్తం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ పాపులర్ అయిన జక్కన్న ప్రస్తుతం ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో #RRR అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న టీం గుజరాత్ లో మరో షెడ్యూల్ కోసం బయలుదేరింది. గుజరాత్ లో ఈ చిత్రానికి సంబంధించి భారీ షెడ్యూల్ ను తెరకెక్కించబోతున్నారు. అక్కడ షూటింగ్ కోసం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు ఈ ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గుజరాత్ లోని వడోదరకు బయల్దేరారు.

ట్విట్టర్ లో చెప్పిన తారక్

ఈ విషయాన్ని తారక్ ట్విట్టర్ లో వెల్లడించారు. భారీ షెడ్యూల్ కోసం బయల్దేరుతున్నానని ట్వీట్ చేశాడు. రాజమౌళి, రామ్ చరణ్, తారక్ టికెట్స్ ని ఫోటో తీసి ఆ టికెట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని జక్కన్న రూపొందిస్తున్నాడు. త్వరలోనే మిగిలిన అప్ డేట్స్ ఇవ్వనుంది టీం. దాదాపు 350 కోట్లతో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

Tags:    

Similar News