చరణ్ వలన ఆగిన #RRR షూటింగ్..!

ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాని జెట్ స్పీడు తో షూటింగ్ చేస్తున్నాడు. తొలి షెడ్యూల్ లో ఎన్టీఆర్, [more]

;

Update: 2019-04-03 12:52 GMT
Ramcharan
  • whatsapp icon

ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాని జెట్ స్పీడు తో షూటింగ్ చేస్తున్నాడు. తొలి షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మీద యాక్షన్ సన్నివేశాలు చేసిన రాజమౌళి… సెకండ్ షెడ్యూల్ లో రామ్ చరణ్ మీద షూట్ చేసాడు. తాజాగా గుజరాత్ లో మూడో షెడ్యూల్ ని భారీగా ప్లాన్ చేసాడు రాజమౌళి. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ల తో పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న అలియా భట్, అలాగే బాలీవుడ్ అజయ్ దేవగణ్ కూడా ఈ మూడో షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. అయితే సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. నిన్న జిమ్ లో రామ్ చరణ్ గాయపడడంతో ఈ షెడ్యూల్ ను వాయిదా వేశారు. ఆ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం స్వయంగా ట్వీట్ చేసింది. జిమ్ లో గాయపడిన రామ్ చరణ్ మూడు వారాలు రెస్ట్ తీసుకున్న తర్వాత తిరిగి షూటింగ్ లో జాయిన్ కానున్నాడని సమాచారం.

Tags:    

Similar News