#RRR సినిమా కథ ఇదే..!

ఒకే ఒక్క ప్రెస్ మీట్ తో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు రాజమౌళి. తన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, నిర్మాత దానయ్యతో కలిసి #RRR సినిమాపై [more]

Update: 2019-03-14 07:34 GMT

ఒకే ఒక్క ప్రెస్ మీట్ తో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు రాజమౌళి. తన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, నిర్మాత దానయ్యతో కలిసి #RRR సినిమాపై ప్రెస్ మీట్ నిర్వహించాడు. గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా ఉన్న #RRR ప్రెస్ మీట్ ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో #RRR విడుదల డేట్, కథ, నటీనటుల వివరాలు ప్రకటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30న విడుదలవుతుందని, #RRR కథకు మూలం..1920 కాలంలో ఉత్తరభారతంలో జరిగిన కథ అని చెప్పిన రాజమౌళి.. #RRRలో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్.. అల్లూరి సీత రామరాజుగా కనిపించబోతున్నారని వారి పాత్రలను రివీల్ చేసాడు.

ఇద్దరు వీరుల కథతో…

అయితే అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు యుక్తవయసులో కనబడకుండా పోయి మళ్లీ కొన్నాళ్లకు పరిపక్వత కలిగిన వ్యక్తులుగా తిరిగొచ్చాక.. ప్రజల కోసం ఉద్యమాలు చేశారు. అయితే కొమరం భీం, అల్లూరి సీతారామరాజు జీవితాల్లో చాలా సారూప్యతలు ఉన్నాయని, వారు యుక్త వయసులో మాయమవకుండా ఉంటే.. వారి ఆలోచనలు ఎలా ఉండేవో.. ఆ ఆలోచనలు కలిసి పంచుకుంటే… ఒకరివలన ఒకరు ఎలా ప్రభవితం అవుతారో అనే ఆలోచనతోనే ఈ #RRR కథ పుట్టిందని రాజమౌళి చెప్పాడు.

Tags:    

Similar News