రీ రిలీజ్ అయిన 'ఆర్ఆర్ఆర్'.. హౌస్ ఫుల్స్
భీమ్, రామరాజు క్యారెక్టర్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం రీరిలీజ్ లోనూ, ఓటీటీలోనూ ఇండియన్ సినిమా సత్తాను ఆర్ఆర్ఆర్ చాటింది.;
ఆర్ఆర్ఆర్.. సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. RRR భారతీయ సినిమాలలో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం అన్ని భారతీయ భాషలలో బాగా ఆడింది. ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో టాప్ స్లాట్‌లో ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో RRR అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా రీ-రిలీజ్ గురించి వినడం చాలా క్రేజీగా ఉంది. RRR సినిమాను అమెరికాలో రీరిలీజ్ చేయడం విశేషం. ఇంత గ్రాండ్ సినిమాను ఓటీటీలో చూస్తే ఏమొస్తుందో అనుకున్నారో ఏమో థియేటర్లలో చూడడానికి పలువురు అమెరికన్స్ క్యూ కట్టారు. USA అంతటా మళ్లీ విడుదలైంది. మంచి రెస్పాన్స్ ను అందుకుంది. హౌస్ ఫుల్స్ మళ్లీ పడడం విశేషం. విదేశీయులు ఈ సినిమాను థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ట్విట్టర్ లో అమెరికన్ల నుండి ప్రశంసలను అందుకుంటూ ఉంది ఆర్ఆర్ఆర్.