ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ కొత్త సినిమా స్టోరీ ఇదే..!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ ఏంటా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో సైతం ఉంది. కానీ ఇంతవరకు ఆయన [more]

;

Update: 2019-03-07 06:30 GMT
ajay bhupathi next film
  • whatsapp icon

ఆర్ఎక్స్ 100 చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ ఏంటా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో సైతం ఉంది. కానీ ఇంతవరకు ఆయన తన నెక్స్ట్ మూవీ ఏంటో ప్రకటించలేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు అజయ్ భూపతి ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో రాబోతున్నాడట. దానికి టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అదే ‘మహా సముద్రం’. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఈ కథ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. ఇందులో ఇద్దరు హీరోస్ నటించనున్నారు. హీరోయిన్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయింది. సమంత అని సమాచారం. సముద్రం అంటే ఇద్దరు హీరోల పాత్రల తాలూకు లక్షణం.

త్వరలోనే సెట్స్ పైకి…

ఒక్కరు శాంతంగా ఉంటే మరొకరు ఉద్వేగంతో ఎగసిపడుతూ ఉంటాడు. ఈ చిత్రం చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని చెబుతున్నారు. అంతేకాదు ఇందులో ట్విస్టులు కూడా ఉంటాయట. ప్రేమ కథ కూడా ఉంటుందని టాక్. ఆర్ఎక్స్ 100తో హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ఈ సినిమాతో కూడా తన పేరుని నిలబెట్టుకోవాలని చాలానే కష్టపడుతున్నాడు. అయితే ఇద్దరు హీరోస్ లో ఒకరు కన్ఫర్మ్ కాగా మరొకరు ఇంకొద్ది రోజుల్లో ఫైనల్ కాబోతున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా అధికారంగా ప్రకటించనున్నారు.

Tags:    

Similar News