దర్శకుడిగా ఫ్లాప్.. విలన్ గా హిట్..!
పెద్ద సినిమాలు చేసి దర్శకుడిగా ఫెయిల్ అయిన తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా సెటిల్ అయ్యేలాగే కనబడుతున్నాడు స్పైడర్ విలన్ ఎస్.జె.సూర్య. గతంలో మహేష్ [more]
;
పెద్ద సినిమాలు చేసి దర్శకుడిగా ఫెయిల్ అయిన తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా సెటిల్ అయ్యేలాగే కనబడుతున్నాడు స్పైడర్ విలన్ ఎస్.జె.సూర్య. గతంలో మహేష్ [more]
పెద్ద సినిమాలు చేసి దర్శకుడిగా ఫెయిల్ అయిన తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా సెటిల్ అయ్యేలాగే కనబడుతున్నాడు స్పైడర్ విలన్ ఎస్.జె.సూర్య. గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అజీత్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు డైరెక్ట్ చేసిన సూర్య.. దర్శకుడిగా కొన్ని హిట్స్ కొట్టినా చాలాకాలంగా డైరెక్టర్ గా సూర్య కెరీర్ ప్రమాదంలో పడింది. అయినా ఢీలా పడకుండా నటుడిగా ఫిక్స్ అయ్యాడు. ఇక విలన్ గా సూర్య ఎప్పటికప్పుడే సత్తా చాటుతున్నాడు. మరీ సిక్స్ ప్యాక్ విలన్ గా కాకుండా స్టైలిష్ విలన్ లా ఎస్.జె.సూర్య అందరినీ ముగ్దుల్ని చేస్తున్నాడు. స్పైడర్ లో శాడిస్ట్ విలన్ గా, హీరో విజయ్ అదిరిందిలో డాక్టర్ విలన్ గా అదరగొట్టిన సూర్య తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో విలన్ అవతారమెత్తబోతున్నాడు.
రజనీకాంత్ సినిమాలో విలన్ గా…
మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో విలన్ గా సూర్య కనిపించబోతున్నాడట. ఎలాగూ మురుగదాస్ స్పైడర్ లో సూర్య విలన్ గా అదరగొట్టేసాడు. మరి ఆ నటనకు ఇంప్రెస్స్ అయిన మురుగదాస్ సూర్యని మళ్లీ తన సినిమాలో విలన్ క్యారెక్టర్ కి తీసుకున్నాడు. మరి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఎస్.జె.సూర్య విలనిజం ఏ రేంజ్ లో మురుగదాస్ చూపిస్తాడో అనేది ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో ఆసక్తిగా జరుగుతున్న చర్చ. ఇక కేవలం రజనీతోనే కాదు.. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ నటిస్తున్న మరో తమిళ మూవీలో కూడా సూర్య కీలకపాత్ర చేస్తున్నాడు.