సాహో తెలుగు స్టేట్స్ లో ఓకే కానీ అక్కడే దారుణంగా ఉంది
డివైడ్ టాక్ తో తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ లో కూడా ఒక ఊపు ఊపేస్తున్న సాహో చిత్రం రికార్డ్స్ దిశగా వెళ్తుంది. బాలీవుడ్ లో పెద్ద [more]
డివైడ్ టాక్ తో తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ లో కూడా ఒక ఊపు ఊపేస్తున్న సాహో చిత్రం రికార్డ్స్ దిశగా వెళ్తుంది. బాలీవుడ్ లో పెద్ద [more]
డివైడ్ టాక్ తో తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ లో కూడా ఒక ఊపు ఊపేస్తున్న సాహో చిత్రం రికార్డ్స్ దిశగా వెళ్తుంది. బాలీవుడ్ లో పెద్ద హీరోస్ సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కానీ తమిళనాట మాత్రం ఈమూవీ బాహుబలి మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది.
తమిళనాడు లో మొదటి రోజు నుండే డల్ గా ఉన్నాయి కలెక్షన్స్. మొదటి రోజే నెగటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పడిపోయాయి. తమిళంలో ఈ చిత్రానికి కనీసం అరవై శాతం నష్టాలు ఖాయమని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్లాప్ అని టాక్ రావడంతో జనాలు ఈమూవీ ని అసలు పట్టించుకోలేదు.
ఈ చిత్రం కోసం సూర్య చిత్రాన్ని వాయిదా వేసుకోవడం గమనార్హం. తమిళనాడు లోనే కాదు కేరళ లో కూడా సాహో పరిస్థితి అలానే ఉంది. తెలుగు రాష్ట్రాలు, నార్త్ ఇండియాతో పాటు కర్నాటకలో ప్రభాస్ జెండా పాతేసినా కానీ దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కేరళ లో మాత్రం కలెక్షన్స్ డల్ అయ్యాయి.