సాహో వీడియో వైరల్

బాహుబలి సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హై ఎక్స్ పెక్టషన్స్ తో చేస్తున్న చిత్రం సాహో. దాదాపు 250 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న [more]

Update: 2019-05-20 10:05 GMT

బాహుబలి సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హై ఎక్స్ పెక్టషన్స్ తో చేస్తున్న చిత్రం సాహో. దాదాపు 250 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ ఈ రోజే పూర్తయిందని నటుడు మురళీ శర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువని అందరికీ తెలిసిందే. కార్ ఛేజింగ్‌లు, ఫైట్లు సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. అయితే ఈ సందర్భంగా మురళి శర్మ ఛేజ్‌ సన్నివేశాన్ని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరినట్లు తెలిపారు.




https://platform.twitter.com/widgets.js

వీడియో షేర్ చేసిన మురళీ శర్మ

అలానే షూటింగ్ సమయంలో ధ్వంసమైన కారును తరలిస్తుండగా తీసిన వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ సినిమా ఓ ట్రీట్‌ కాబోతోందని పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ భారీగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ హక్కులు 42 కోట్లకి అమ్ముడైనట్టు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 15న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.

Tags:    

Similar News