సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడు..!

నటుడు సాయి ధరమ్ తేజ్ వరుసగా ఫ్లాప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మనోడి కెరీర్ పై ఎక్కడ ప్రభావం పడుతుందో అని భయపడి స్నేహితులు, సన్నిహితులు [more]

Update: 2019-03-20 07:34 GMT

నటుడు సాయి ధరమ్ తేజ్ వరుసగా ఫ్లాప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మనోడి కెరీర్ పై ఎక్కడ ప్రభావం పడుతుందో అని భయపడి స్నేహితులు, సన్నిహితులు చెప్పిన మాట వింటున్నాడేమో. అతను తన నెక్స్ట్ సినిమా నుండి స్క్రీన్ నేమ్ మార్చుకోనున్నాడు. న్యూమరాలజీ మీద నమ్మకంతో తన పేరు మార్చుకుంటున్నాడు. సాయి తేజ్ అన్నది కొత్త స్క్రీన్ పేరు. త్వరలోనే రాబోయే చిత్రలహరి టైటిల్స్ లో ఈ విధంగానే ఉండబోతోంది.

మారుతి చెప్పడనేనా..?

ఇప్పటికే నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ సింగల్ పరుగు పరుగు పాట వీడియో టైటిల్స్ లో సాయితేజ్ అనే ప్రకటించారు. డైరెక్టర్ మారుతికి కూడా జాతకాలు, న్యూమరాలజీ వంటి వ్యవహారాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తేజు నెక్స్ట్ సినిమా మారుతితో చేయబోతున్నాడు కాబట్టి అతను ఏమైనా తేజుకి ఈ న్యూమరాలజీ అంటించాడేమో అని అనుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. పేరు మార్చుకున్నాడు కాబట్టి హిట్ కొడతాడేమో చూద్దాం.

Tags:    

Similar News