కొరటాల హ్యాండ్ నుండి బయటికొచ్చిన చిత్రలహరి

సాయి ధరమ్ తేజ్ కి ఆరు ప్లాప్స్, కళ్యాణి ప్రియా దర్శినికి హలో ప్లాప్, కిషోర్ తిరుమలకి ఉన్నది జిందగీ ప్లాప్. మరి ఈ ప్లాప్స్ త్రయం [more]

;

Update: 2019-04-12 03:25 GMT
pawan kalyan response over chitralahari
  • whatsapp icon

సాయి ధరమ్ తేజ్ కి ఆరు ప్లాప్స్, కళ్యాణి ప్రియా దర్శినికి హలో ప్లాప్, కిషోర్ తిరుమలకి ఉన్నది జిందగీ ప్లాప్. మరి ఈ ప్లాప్స్ త్రయం కలిసి ఒక సినిమా చేస్తే ఆ సినిమా మీద మార్కెట్ లో ట్రేడ్ లో ఎలాంటి అంచనాలుంటాయి. కానీ ఆ అందరూ కలిసి చేసిన చిత్రలహరి సినిమా మీద ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తే ఉంది. చిత్రలహరి సాంగ్ ప్రోమోస్, ట్రైలర్ అన్ని సినిమా మీద అంచనాలు పెంచేసాయి. ప్రస్తుతం చిత్రలహరి సినిమా నేడు శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. మంచి ప్రమోషన్స్ తో సినిమా మీద ఆసక్తి కలిగేలా చేసిన సాయి ధరమ్.. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చిత్రలహరి సినిమా విషయంలో కొరటాల పాత్ర గురించి ఆసక్తికర విషయాన్నీ మీడియా తో పంచుకున్నాడు.

చిత్రలహరి సినిమా చేసిన వారంతా ఏదో ఒక ప్లాప్ తో ఉన్నవాళ్ళమే. అందుకే ఈ సినిమా హిట్ అందరికి చాలా అవసరం. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన కొరటాల కి చూపించి ఆయన సజెషన్స్ తో సినిమా చేసాము. కొరటాల ఇచ్చిన సలహాలు సూచనలు సరిగ్గా అమలు చేస్తూ చిత్రలహరి షూటింగ్ పూర్తి చేశామని .. కొరటాల శివ చెప్పిన విషయాలు తమకెంతో ఉపయోగ పడ్డాయని చెప్పిన సాయి ధరమ్.. చిత్రలహరి కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా కొరటాల శ్రద్ద తీసుకోబట్టి మాకు ఈ సినిమా విజయంపై నమ్మకం కలిగిందని చెబుతున్నాడు. మరి దీనిబట్టి చిత్రలహరిలో కొరటాల హ్యాండ్ ఎంత బలంగా ఉందొ అర్ధమవుతుంది.

Tags:    

Similar News