ఫెయిల్యూర్స్ తో గుణపాఠం నేర్చుకున్న తేజు
ఫెయిల్యూర్స్ వల్ల ఎంతో కొంత నేర్చుకుంటున్న అంటున్నాడు సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో ఒకటి రెండో హిట్స్ ఉన్నాయ్ అంతే. తరువాత అన్ని సినిమాలు [more]
ఫెయిల్యూర్స్ వల్ల ఎంతో కొంత నేర్చుకుంటున్న అంటున్నాడు సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో ఒకటి రెండో హిట్స్ ఉన్నాయ్ అంతే. తరువాత అన్ని సినిమాలు [more]
ఫెయిల్యూర్స్ వల్ల ఎంతో కొంత నేర్చుకుంటున్న అంటున్నాడు సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో ఒకటి రెండో హిట్స్ ఉన్నాయ్ అంతే. తరువాత అన్ని సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. అందుకే ఇప్పుడు దీన్ని సవాల్ గా తీసుకుని గెటప్ పూర్తిగా మార్చుకుని తిరుమల కిషోర్ దర్శకత్వంలో చిత్రలహరికి రెడీ అయ్యాడు.
ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇది ఇలా ఉంటె తన ఫెయిల్యూర్స్ గురించి తేజుకు మంచి క్లారిటీ ఉందట. స్క్రిప్ట్ పేపర్ మీద ఉన్నప్పుడు చూడటానికి చదవటానికి చాల బాగున్నా సెట్స్ మీదకు వెళ్ళేపాటికి వర్క్ అవుట్ అవ్వట్లేదని తన జడ్జ్ మెంట్ వల్లే ఇలాంటి ఫలితాలు చవిచూడాల్సి వచ్చిందని చెప్పుకున్నాడు.
తేజుకి మంచి విషయాలే తెలిసాయి కానీ కొంచం లేట్ అయింది. వాస్తవానికి తేజు ఇప్పటివరకు చేసిన డైరెక్టర్స్ అందరు స్టార్ డైరెక్టర్ యే. వివి వినాయక్, కరుణాకరన్ ఇలా ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వాళ్ళే అందరూ. కానీ తేజు దగ్గరకు వచ్చేపాటికి రిజల్ట్స్ తేడా కొట్టాయి.స్టార్ డైరెక్టర్స్ తో చేసిన వర్క్ అవుట్ అవ్వట్లేదని గ్రహించి చిన్న డైరెక్టర్స్ తో మంచి స్క్రిప్ట్ ఉంటె చేసేద్దాం అని డిసైడ్ అయ్యాడు తేజు. అందుకే రెండు మూడు సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న కిషోర్ తో ‘చిత్రలహరి’ అనే సినిమా చేస్తున్నాడు. తేజు సరసన కళ్యాణి ప్రియదర్శిన్, నివేతా పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు