మారుతికి చిత్రలహరితో లింక్ పెట్టిన తేజూ

సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం చిత్రలహరి విడుదలకు సిద్ధమవుతుంది. చిత్రలహరి తర్వాత సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో నటించబోతున్నాడని న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలో [more]

;

Update: 2019-03-22 07:44 GMT
sai dharm tej movie with maruthi
  • whatsapp icon

సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం చిత్రలహరి విడుదలకు సిద్ధమవుతుంది. చిత్రలహరి తర్వాత సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో నటించబోతున్నాడని న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ లాయర్ గా కనిపిస్తాడని.. అలాగే సాయి ధరమ్ కి జోడిగా రకుల్ ప్రీత్ పేరు హీరోయిన్ గా పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జోరుగా జరుగుతుంది. చిత్రలహరి సినిమా ఏప్రిల్ లో విడుదలవుతుండగా.. మారుతి చిత్రం మే నుండి సెట్స్ మీదకు వెళుతుందని అన్నారు. అయితే మారుతి, సాయి ధరమ్ కోసం ఇప్పటివరకు పూర్తి కథని ప్రిపేర్ చెయ్యలేదని తెలుస్తుంది.

చిత్రలహరి టాక్ బట్టే

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సాయి ధరమ్ తో మారుతి చిత్రం ఉంది. కానీ కథ మాత్రం ఇంకా సెట్ కాలేదని.. అసలు స్టోరీ లైన్ చెప్పినా కథని మారుతి ఇంతవరకు సిద్ధం కాలేదనేది తాజా సమాచారం. మారుతి ద‌గ్గ‌ర బౌండెడ్ స్క్రిప్ట్ అంటూ ఏదీ లేదు. కేవ‌లం కొన్ని లైన్స్ మాత్ర‌మే ఉన్నాయి. వాటిని డెవ‌ల‌ప్ చేస్తున్నాడట. ఇక మారుతి ఇంతవరకు కథని ప్రిపేర్ చేయకపోవడానికి కారణం మాత్రం సాయి ధరమ్ తేజే అని చెబుతున్నారు. ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్… చిత్రలహరి సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. చిత్రలహరి టాక్ ని బట్టే మారుతి కథ వింటానని సాయి ధరమ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక చిత్రలహరి హిట్ అయితే సాయి ధరమ్, మారుతితో చెయ్యాలా వద్దా అనే ఆలోచన చేస్తే మారుతి మాత్రం చిత్రలహరి టాక్ ని బట్టి సాయి ధరమ్ కి సరిపోయే స్టోరీని సెట్ చేస్తాడని చెబుతున్నారు.

Tags:    

Similar News