తేజుకే కాదు.. ఇప్పుడు రామ్ కి కూడా

ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది యంగ్ హీరోస్ వరస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నారు. వరస ప్లాప్స్ తో వారి మార్కెట్ పూర్తిగా డౌన్ అయ్యింది. అయితే ఆయా [more]

Update: 2019-02-07 05:41 GMT

ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది యంగ్ హీరోస్ వరస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నారు. వరస ప్లాప్స్ తో వారి మార్కెట్ పూర్తిగా డౌన్ అయ్యింది. అయితే ఆయా హీరోల మార్కెట్ కి అనుకూలంగానే నిర్మాతలు కూడా బడ్జెట్ ని సెట్ చేస్తున్నారు. తాజాగా సాయి ధరమ్ – కిషోర్ తిరుముల చిత్రలహరి విషయంలో మైత్రి మూవీస్ వారు బడ్జెట్ లో కోత విధించినట్లుగా గత రెండు రోజులనుండి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే తేజ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే… మైత్రి మూవీస్ వారు అలా చేశారని అంటున్నారు. మరోపక్క మరో హీరో పరిస్థితి కూడా ఇలానే ఉంది.

ఆ హీరో మరెవరో కాదు హీరో రామ్. హీరో రామ్ కూడా వరస వైఫల్యాలతో బాధపడుతున్నాడు. యావరేజ్ హిట్స్ కొడుతున్నాడు కానీ… హిట్ కొట్టలేకపోతున్నాడు. హిట్ అవుతాయన్న ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే చిత్రాలు కూడా యావరేజ్ పడేసరికి రామ్ మార్కెట్ పడిపోయింది.. దానికి తగ్గట్టుగా అన్ని తుడుచుపెట్టుకుని పోయి… కెరీర్ అగమ్యగోచరంగా మారిన దర్శకుడు పూరి జగన్నాధ్ తో రామ్ కమిట్ అవడంతో.. వీరి కాంబో మీద ఓ అన్నట్టు అంచనాలు లేవు. ఇక బయట నిర్మాతలెవరు రాకపోయేసరికి మళ్ళీ పూరీనే ఛార్మి తో కలిసి ఇస్మార్ట్ శంకర్ ని నిర్మిస్తున్నాడు.

అయితే భారీ అంచనాలేమి లేని ఈ సినిమాకి బిజినెస్ కూడా భారీగా జరిగే అవకాశాలు లేకపోవడం… అదంతా పూరి మెడకు చుట్టుకోకుండా ఇప్పుడు రామ్ కూడా ఈ సినిమాలో భాగస్వామి అవుతున్నాడనే టాక్ మొదలైంది. ఒక్కో సినిమాకి మూడు కోట్లు పారితోషకం తీసుకునే రామ్ ఇప్పుడు పూరి సినిమాకి మూడు కోట్లలో సగం మాత్రమే తీసుకుంటున్నాడట. అయితే కథ నచ్చి పూరితో సినిమా చెయ్యాలనుకున్న రామ్.. పూరీని పిలిచి కథ బావుంది సినిమా ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావొద్దని.. నా పారితోషకం విషయం ఆలోచించవద్దని చెప్పడంతో.. ఇప్పుడు రామ్ తన పారితోషకాన్ని సగానికి సగం తగ్గించుకోవాల్సి వచ్చిందంటున్నారు. మరి తేజుకి అలా.. రామ్ కి ఇలా.

Tags:    

Similar News