ఇలా అయితే ఎలా సాయి పల్లవి..!

ప్రేమమ్, ఫిదా సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమయిన సాయి పల్లవి చాలా త్వరగా స్టార్ హీరోయిన్ అయిపోతుందని భావించారు అంతా. కానీ వచ్చిన ఆఫర్స్ ని కాలితో తన్నేస్తోంది. [more]

;

Update: 2019-02-02 06:44 GMT
sia pallavi rejected offer
  • whatsapp icon

ప్రేమమ్, ఫిదా సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమయిన సాయి పల్లవి చాలా త్వరగా స్టార్ హీరోయిన్ అయిపోతుందని భావించారు అంతా. కానీ వచ్చిన ఆఫర్స్ ని కాలితో తన్నేస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణంలో ఛాన్స్ వచ్చినా నో చెప్పింది. మంచి హీరో మంచి కథ అయితేనే ఓకే చెప్తానంటూ పట్టు బట్టుకు కూర్చుంది సాయి పల్లవి. రీసెంట్ గా ఆమె శర్వాతో చేసిన ‘పడి పడి లేచే మనసు’, నాగ శౌర్యతో చేసిన ‘కణం’ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. అంతేకాదు స్కిన్ షో చేయను అని చెప్పడంతో అసలు ఆఫర్స్ రావడం లేదు. ఒకటి రెండు ఆఫర్స్ వచ్చినా వాటికి కూడా కండిషన్స్ పెట్టడంతో ఈమె వద్దకు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అసలు రావడం లేదు.

hero comments on sai pallavi

ఆ ఫార్ములా అర్థం చేసుకోలేదా..?

హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పుడు ప్రతి సినిమా ఓకే చేస్తే అప్పుడప్పుడు ఫిదా లాంటి సినిమాలు వస్తుంటాయి. ఇండస్ట్రీలో ఉండాలి అంటే వచ్చిన ప్రతి సినిమాకు ఓకే చెప్పాల్సిందే. ఈ ఫార్ములా ఆలోచించే చాలామంది హీరోయిన్స్ సక్సెస్ అయ్యారు. తమిళంలో లేటెస్ట్ గా చేసిన మారి 2 నెగటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో తమిళంలో కూడా సీన్ రివర్స్ అయ్యింది. తెలుగులో రెండు మూడు ఆఫర్స్ ఉన్నా అవి ఇంకా ఓకే చేయలేదు. అలా ప్రస్తుతం సాయి పల్లవికి ఆఫర్స్ తగ్గాయనే చెప్పాలి.

Tags:    

Similar News