పెళ్లిపై సాయిప‌ల్ల‌వి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

మలయాళ ప్రేమమ్ తో బాగా ఫెమస్ అయిన డాక్టర్ పిల్ల సాయి పల్లవి.. తెలుగు, తమిళంలోనూ మంచి గుర్తింపు పొందింది. డాన్స్ లో తనదైన స్టయిల్లో ఇరగదీసే [more]

Update: 2019-02-10 08:14 GMT

మలయాళ ప్రేమమ్ తో బాగా ఫెమస్ అయిన డాక్టర్ పిల్ల సాయి పల్లవి.. తెలుగు, తమిళంలోనూ మంచి గుర్తింపు పొందింది. డాన్స్ లో తనదైన స్టయిల్లో ఇరగదీసే సాయి పల్లవి… తెలుగులో ఫిదా, ఎంసీఏ సినిమాలతో అదరగొట్టేసింది. ఫిదా సినిమాలోని నచ్చిందే పిల్ల సాంగ్ తో యూట్యూబ్ ని షేక్ చేసిన సాయి పల్లవి మళ్లీ తన రికార్డుని తానే తిరగరాసింది. తమిళనాట ధనుష్ తో నటించిన మరి 2 సినిమా అయితే హిట్ కాలేదు కానీ.. అందులోని రౌడీ బేబీ సాంగ్ మాత్రం యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతుంది. రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న రౌడీ బేబీ సాంగ్ లో సాయి పల్లవి, ధనుష్ ల కెమిస్ట్రీ, సాయి పల్లవి డాన్స్ అదుర్స్ అన్న రేంజ్ లో ఉన్నాయి.

పెళ్లే చేసుకోను

ఇక ప్రస్తుతం తెలుగులో సినిమాలకు సైన్ చెయ్యకపోయినా తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి పెళ్లి అంటే నో నో అంటున్నది. అప్పుడే పెళ్లి చేసుకోదేమో.. కెరీర్ లో హిట్ అయ్యాకే పెళ్లి గురించి ఆలోచించి అలా అన్నదేమోలే అని అనుకోకండి. అసలు సాయి పల్లవి పెళ్లే చేసుకోదట. సాయి పల్లవి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ఎప్పటికి సింగిల్ గానే ఉండి నా పేరెంట్స్ ను బాగా చూసుకోవాలనుకుంటున్నాను అంటూ పెళ్లి పై తన అభిప్రాయాన్ని అలా చెప్పేసింది ఈ డాక్టర్ కం యాక్టర్.

Tags:    

Similar News