ధనుష్ రికార్డు బ్రేక్ చేసిన సాయి పల్లవి

ఈమధ్య యూట్యూబ్ రికార్డ్స్ కొత్తేమి కాదు మన తెలుగు ఇండస్ట్రీ కి. సౌత్ ఇండియా లో నెంబర్ వన్ ప్లేస్ లో యూట్యూబ్ వ్యూస్ రికార్డు చేసిన [more]

Update: 2019-01-07 08:00 GMT

ఈమధ్య యూట్యూబ్ రికార్డ్స్ కొత్తేమి కాదు మన తెలుగు ఇండస్ట్రీ కి. సౌత్ ఇండియా లో నెంబర్ వన్ ప్లేస్ లో యూట్యూబ్ వ్యూస్ రికార్డు చేసిన ధనుష్ 3 సినిమాలో 'కొలవెరిడి’ సాంగ్ ను ఇప్పుడు మన తెలుగు సాంగ్ బ్రేక్ చేసి నెంబర్ వన్ స్తానం లో ఉంది. 'కొలవెరిడి’ సాంగ్ తో వన్ నైట్ స్టార్ అయ్యాడు అనిరుధ్. రీసెంట్ గా మన తెలుగు సినిమా సాంగ్ ఆ రేర్ ఫీట్ సాధించింది.

వరుణ్ – సాయి పల్లవి జంటగా నటించిన ‘ఫిదా’ సినిమాలో 'వచ్చిందే' సాంగ్ 'కొలవెరిడి’ సాంగ్ బ్రేక్ చేసింది. ఈ క్రేజీ సాంగ్ ను సింగర్ మధుప్రియ ఆలపించింది. నైజాం యాసతో అదరకొట్టిన ఈ సాంగ్ ను శక్తికాంత్ సంగీతం ఇస్తే అశోక్ తేజ సాహిత్యం అందించారు. ఈ సాంగ్ లో సాయి పల్లవి డ్యాన్సింగ్ స్కిల్ కొరియోగ్రఫీ అయితే వేరే చెప్పనవసరం లేదు. తన డ్యాన్సింగ్ ట్యాలెంటుతో అందరిని ఫిదా చేసింది ఈ పిల్ల. అందుకే రికార్డు బ్రేక్ చేయగలిగింది.

అంతకుముందు 'కొలవెరిడి’ పాటకు 172 మిలియన్ వ్యూస్ 1.4 మిలియన్ లైక్స్ వచ్చి సౌత్ ఇండియా నెంబర్ వన్ యూట్యూబ్ సాంగ్స్ గా రికార్డు ఉంది. ఇప్పుడు ఆ రికార్డు ను ‘వచ్చిందే’ సాంగ్ బ్రేక్ చేసింది. 173 మిలియన్ల వ్యూస్ 418 లైక్ లు సాధించింది. ఈ రికార్డు కేవలం ఏడాది లోగానే బ్రేక్ చేయడం విశేషం.

Tags:    

Similar News