అందుకే నయన్ అలిగిందా

నిన్న విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమాకి వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ రావడమే కాదు పక్కా హిట్ జోనర్ లోకి వెళ్ళినట్లే. మెగా ఫాన్స్ కి [more]

;

Update: 2019-10-03 08:36 GMT
నయనతార
  • whatsapp icon

నిన్న విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమాకి వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ రావడమే కాదు పక్కా హిట్ జోనర్ లోకి వెళ్ళినట్లే. మెగా ఫాన్స్ కి సైరా చూశాక పండగ చేసుకోవడం కాదు నకాలొచ్చేస్తున్నాయ్. ఐదు భాషల్లో సైరా హిట్ కొట్టడంతో వారు ఐదు రోజుల ముందే దసరా చేసేసుకుంటున్నారు. ఇక సినిమా హిట్ అయినందుకు సైరా యూనిట్ అందరిలో కన్నా ఎక్కువగా హీరోయిన్ తమన్నానే సంతోషంతో గంతులేస్తుంది. ఈ సినిమాలో సైరా కి భార్య సిద్ధమా పాత్రలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తే నరసింహారెడ్డి ప్రేమికురాలి పాత్రలో తమన్నా నటించింది.

హైలెట్ అయ్యింది…..

తమన్నది చిన్న రోల్ అని మొదట్లో అనుకున్నారు. అయినా తమన్నా సైరా ప్రమోషన్స్ లో తాను హైలెట్ అవడానికి పాల్గొంటుందని కూడా అన్నారు. ఇక నయనతారని రామ్ చరణ్ బ్రతిమాలినా సైరా ప్రమోషన్స్ కి రాలేదని, మెగాస్టార్ అయితే నాకేంటి అన్నట్టుగా నయన్ ఉందని ప్రచారం జరిగింది. అయితే సైరా సినిమా విడుదలయ్యాక సినిమాలో నయన్ పాత్ర కన్నా తమన్నా లక్ష్మి పాత్ర హైలెట్ అవడమే కాదు.. నయన్ కన్నా ఎక్కవగా తమన్నా పాత్రకి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉండడం వలనే నయనతార అలిగి సైరా ప్రమోషన్స్ కి డుమ్మాకొట్టిందనే ప్రచారం జరుగుతుంది. తమన్నాకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మెయిన్ హీరోయిన్ అయిన తనని లైట్ తీసుకోవడం పై నయన్ ఆగ్రహంగా ఉండడంతోనే చరణ్ రిక్వెస్ట్ ని కాదంది అంటున్నారు.

 

Tags:    

Similar News