సైరా టార్గెట్ కూడా పెద్దదే..!!

రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి విడుదలకు సిద్దమవుతుండగా.. సినిమా ప్రమోషన్స్ తో పాటుగా బిజినెస్ కూడా ఓ [more]

Update: 2019-09-12 06:21 GMT

రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి విడుదలకు సిద్దమవుతుండగా.. సినిమా ప్రమోషన్స్ తో పాటుగా బిజినెస్ కూడా ఓ రేంజ్ లో మొదలైంది. ఇప్పటికే సై రా నరసింహారెడ్డి అన్ని భాషల డిజిటల్ రైట్స్ ని 45 కోట్లకి అమ్మేసినట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా సై రా నరసింహారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల లెక్కలు కూడా బయటికొచ్చాయి.

హాట్ టాక్ తో…..

రెండు తెలుగు రాష్ట్రాల్లో సై రా నరసింహారెడ్డి సినిమా రూ.11 కోట్ల మేర బిజినెస్ జరుపుకుంది. మరి ఈ టార్గెట్ ని సై రా దసరా సెలవులు పూర్తయ్యేలోపులో కొల్లగొట్టాల్సి ఉంటుంది. ఇక సెలవులు ముగిసి స్కూల్స్ స్టార్ట్ అయితే… సినిమా కలెక్షన్స్ పడిపోతాయి. మరి భారీ క్రేజ్ తో భారీ అంచనాలున్న సై రా కి హాట్ టాక్ పడితే.. ఈ ఫిగర్ పెద్దదేమీ కాదు గాని.. టాక్ తేడా కొడితేనే.. డిస్ట్రిబ్యూటర్స్ సాహో కి బలైనట్లుగా సైరాకు బలిపోవాల్సి ఉంటుంది.

ఏరియా బిజినెస్ (కోట్లలో)

నైజాం 30.00

సీడెడ్ 22.00

నెల్లూరు 5.20

కృష్ణ 9.00

గుంటూరు 11.50

వైజాగ్ 14.40

ఈస్ట్ గోదావరి 10.40

వెస్ట్ గోదావరి 9.20

టోటల్ ఏపీ & టీస్ 111.70

 

Tags:    

Similar News