వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఏప్రిల్ 14, 2022న ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ `స‌లార్‌` గ్రాండ్ రిలీజ్

ప్యాన్ ఇండియా‌ స్టార్‌ ప్రభాస్‌.. ప్యాన్‌ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌.. కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ `స‌లార్‌`. సౌత్ ఇండియా సినిమాను [more]

;

Update: 2021-03-01 05:26 GMT

ప్యాన్ ఇండియా‌ స్టార్‌ ప్రభాస్‌.. ప్యాన్‌ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌.. కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ 'స‌లార్‌'. సౌత్ ఇండియా సినిమాను ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తూ భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న హోంబలే ఫిలింస్‌ అధినేత విజయ్‌ కిరంగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. 2022, ఏప్రిల్ 14న స‌లార్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. 
ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ – “ప్ర‌భాస్‌తో సినిమా అంటే ఆయ‌న అభిమానులు, ప్యాన్ ఇండియా ప్రేక్ష‌కులు ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తారో, సినిమాపై ఎలాంటి అంచ‌నాలుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ప్ర‌భాస్‌ను ఆయ‌న అభిమానులు ఎలా చూడాల‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆ అంచ‌నాల‌ను మించేలా సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. ప్ర‌పంచ వ్యాప్తంగా 2022, ఏప్రిల్‌14న‌ మీ అంద‌రితో క‌లిసి స‌లార్ వేడుక‌ల‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను“ అన్నారు. 

Tags:    

Similar News