బేబీ కి ఏమైంది

సమంత అక్కినేని అంటే ఓ బ్రాండ్ అన్న రేంజ్ లో తయారైంది ఆమె క్రేజ్. అటు హీరోల పక్కన ఇరగదీస్తూనే ఇటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలతోను అదరగొట్టేస్తుంది. [more]

Update: 2019-07-23 06:28 GMT

సమంత అక్కినేని అంటే ఓ బ్రాండ్ అన్న రేంజ్ లో తయారైంది ఆమె క్రేజ్. అటు హీరోల పక్కన ఇరగదీస్తూనే ఇటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలతోను అదరగొట్టేస్తుంది. ఈ ఏడాది మజిలీ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సమంత ఓ బేబీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఓ బేబీ సినిమాలో సమంత నటన ఆమె కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫర్మెన్స్ అన్నట్టుగా ఆకట్టుకుంది. గత ఏడాది యూ టర్న్ తో హిట్ కొట్టిన కలెక్షన్స్ సంపాదించలేని సమంత ఈ ఏడాది ఓ బేబీ తో హిట్ తో పాటుగా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. మరి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఇప్పుడు సమంత బెస్ట్ అనేలా కనిపిస్తుంది దర్శకనిర్మాతలకు. అందుకే చాలామంచి హీరోయిన్ ఓరియెంటెడ్ కథలతో సమంతని కలవడానికి ప్రయత్నిస్తున్నారట.

కానీ సమంత మాత్రం ఆయా కథలు వినేందుకు సుముఖత చూపించటం లేదనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. తెలుగులో ప్రస్తుతం శర్వానంద్ తో కలిసి దిల్ రాజు నిర్మాతగా 96 సినిమా చేస్తున్న సమంత కొత్త ప్రాజెక్ట్ ల జోలికి పోవడం లేదట. ఇక గతంలో ఒప్పుకున్న రెండు మూడు సినిమాలు తప్ప సమంత కొత్త సినిమాలకు సైన్ చెయ్యడం లేదని ఫిలింనగర్ టాక్. గత రెండేళ్లుగా సినిమాలు మీద సినిమాలు చేస్తూ బాగా బిజీగా మారిన సమంత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుందనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. 96 తో పాటుగా ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి… అటు భర్త నాగ చైతన్య కెరీర్ ని గాడిలో పెట్టాలని.. అలాగే నిర్మాణ బాధ్యతలు కూడా తలకెత్తుకోవాలని సమంత చూడడంతోనే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదనే టాక్ కూడా వినబడుతుంది. కానీ సమంత అభిమానులు మాత్రం మా బేబీ సినిమాల్లో నటించకపోతే ఎలా అంటూ బెంగ పెట్టేసుకుంటున్నారు.

Tags:    

Similar News