సమంతని ఎదిరించి తట్టుకోగలడా?

సమంత ఓ బేబీ సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమంత -నందిని రెడ్డి కాంబోలో తెరకెక్కిన ఓ బేబీ సినిమా మీద భారీ అంచనాలే [more]

Update: 2019-07-04 09:29 GMT

సమంత ఓ బేబీ సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమంత -నందిని రెడ్డి కాంబోలో తెరకెక్కిన ఓ బేబీ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. దానికిమరణం ఓ బేబీ ట్రైలర్ అయితే మరో కారణం సమంత ప్రమోషన్స్. ఓ బేబీ సినిమా ని సమంత ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తుంది. ఇక సురేష్ బాబు కూడా పక్క ప్లాన్ తో ఓ బేబీ ని మంచి డేట్ కి విడుదల చేస్తున్నాడు. అయితే నిన్నటివరకు ఓ బేబీ కి శ్రీహరి కొడుకు రాజ్ దూత్, ఆది సాయి కుమార్ బుర్రకథలు పోటీకి వస్తాయనుకున్నారు. కానీ శ్రీహరి కొడుకు రాజదూత్ మాత్రం వాయిదాపడింది. సకాలంలో సెన్సార్ చేయకపోవడంతో ఆ సినిమా వాయిదా పడిందని సమాచారం.

ఇక ఆది సాయికుమార్ బుర్రకథతో సమంత కి పోటీకి వస్తున్నాడు. ఆది సాయి కుమార్ ఇప్పటివరకు భారీ డిజాస్టర్స్ తో ఉన్నాడు. కానీ బుర్రకథ ట్రైలర్ చూసాక సినిమా విషయముందనే అవగాహనకు ప్రేక్షకులు వచ్చారు. అయినా సమంత ని తట్టుకుని ఆది సాయి కుమార్ ఎంతవరకు నిలుస్తాడనే దాని మీద చాలా డౌట్ ఉంది. ఎందుకంటే ఆది సాయి కుమార్ మీద సమంత క్రేజ్ భారీగా ఉండడం, ఆమె టాప్ హీరోయిన్ కావడం, అలాగే ఓ బేబీ సినిమా మీద మంచి అంచనాలు ఉండడం, ప్రమోషన్స్ పీక్స్ లో ఉండడం వంటి వాటితో పోలిస్తే… ఆది సాయికుమార్ బుర్రకథ కు అంత సీన్ లేదనిపిస్తుంది. ట్రైలర్ ఎంతగా ఆకట్టుకుని.. ప్రమోషన్స్ లో బుర్రకథ టీం ఓ బేబీ కన్నా వెనుకబడే ఉన్నారు. మరి రేపు ఈపాటికి ఓ బేబీ దా, లేదంటే బుర్రకథ దా హవా అనేది తెలుస్తుంది

Tags:    

Similar News