షట్లర్ గా సమంత?
అక్కినేని సమంత ప్రస్తుతం తన భర్త తో హాలిడే ని ఎంజాయ్ చేస్తుంది. లక్కీ లేడీగా పిలవబడే సామ్ ప్రస్తుతం శర్వానంద్ సరసన 96 సినిమా రీమేక్ [more]
;
అక్కినేని సమంత ప్రస్తుతం తన భర్త తో హాలిడే ని ఎంజాయ్ చేస్తుంది. లక్కీ లేడీగా పిలవబడే సామ్ ప్రస్తుతం శర్వానంద్ సరసన 96 సినిమా రీమేక్ [more]
అక్కినేని సమంత ప్రస్తుతం తన భర్త తో హాలిడే ని ఎంజాయ్ చేస్తుంది. లక్కీ లేడీగా పిలవబడే సామ్ ప్రస్తుతం శర్వానంద్ సరసన 96 సినిమా రీమేక్ లో నటిస్తుంది. దీనితో పాటు అమెజాన్ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు. ఈ రెండు కంప్లీట్ అయినా తరువాత సామ్ ఏ సినిమా చేబోతుందని క్యూరియాసిటీ మొదలైంది.
ఫిలింనగర్ సమాచారం ప్రకారం సామ్ నెక్స్ట్ అన్నపూర్ణ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతోందని తెలుస్తుంది. అది కూడా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అని తెలుస్తుంది. ఈమధ్య స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వస్తున్నాయి కాబట్టి సామ్ కూడా ఒక షటిల్ క్రీడాకారిణిగా నటించబోతున్నట్లు సమాచారం.
అయితే షటిల్ క్రీడాకారిణిగా అంటే కల్పిత కథతోనా, లేకా బయోపిక్ లాంటిదా అన్నది ఇంకా తెలియదు. ఇంకా డైరెక్టర్ ఎవరో క్లారిటీ లేదు కానీ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.