మరోసారి మజిలీ జంట

ఆఫ్ స్క్రీన్ ప్రేమ జంట అలానే ఆన్ స్క్రీన్ ప్రేమ జంట మరోసారి కలిసి నటించనున్నారు. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో స్టార్ట్ అయిన సామ్ అండ్ [more]

;

Update: 2019-09-25 09:00 GMT

ఆఫ్ స్క్రీన్ ప్రేమ జంట అలానే ఆన్ స్క్రీన్ ప్రేమ జంట మరోసారి కలిసి నటించనున్నారు. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో స్టార్ట్ అయిన సామ్ అండ్ చైతు ప్రేమ ఆ తరువాత ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ మరియు ఈ మధ్యనే ‘మజిలీ’ వంటి చిత్రాలతో అలరించారు. ఒక్క ఆటో నగర్ సూర్య తప్ప మిగిలిన అన్ని చిత్రాలు సక్సెస్ అయినవే.

తండ్రీ కొడుకులుగా…..

తాజాగా ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ కపుల్ మరోసారి కలిసి నటించనున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ‘సోగ్గాడే చిన్నినాయన’ కి ప్రీక్వల్ గా రూపొందనున్న ‘బంగార్రాజు’ అనే ఒక మల్టీస్టారర్ సినిమా లో సమంత చైతు కి జోడిగా నటించనుంది. ఇక నాగార్జున సరసన రమ్యకృష్ణ మళ్లీ హీరోయిన్ గా నటించనుంది. ఈ మూవీలో నాగార్జున, నాగ చైతన్య తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారు. నిజానికి ఈ మూవీ ఎప్పుడూ స్టార్ట్ కావాలి కానీ నాగ్ కి ఈ స్క్రిప్ట్ మీద అంత నమ్మకం లేకపోవడంతో మార్పులు చూపిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈమూవీ షూటింగ్ నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

 

Tags:    

Similar News