సమంత పనిలోకి దిగిపోయింది!!

లాక్ డౌన్ లో ఇళ్లకే పరిమితమైన తారలంతా మెల్లిగా ఇంటి నుండి బయటికి వస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఎప్పుడో షూటింగ్స్ కి దిగిపోయారు. టాలీవడ్ స్టార్స్ ఇప్పుడిప్పుడే [more]

;

Update: 2020-08-29 08:20 GMT

లాక్ డౌన్ లో ఇళ్లకే పరిమితమైన తారలంతా మెల్లిగా ఇంటి నుండి బయటికి వస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఎప్పుడో షూటింగ్స్ కి దిగిపోయారు. టాలీవడ్ స్టార్స్ ఇప్పుడిప్పుడే రంగంలోకి దిగుతున్నారు. రకుల్, శృతి హాసన్, పూజ హేగ్డ్ ఎలాంటి హీరోయిన్స్ షూటింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలెడతారా సెట్స్ లో వాలిపోవాలని చూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా రంగంలోకి దిగింది. సమంత సినిమా షూటింగ్స్ కోసం రెడీ అవ్వలేదు కానీ.. డబ్బింగ్ కోసం ఫ్లైట్ ఎక్కేసింది.

అందరికి ఇష్టమైన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కోసం సమంత డబ్బింగ్ చెప్పడానికి ముంబై వెళ్ళింది. ఆ విషయాన్నీ సోషల్ మీడియా లో షేర్ చేసింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సీజన్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మేకర్స్ సీజన్ 2 ని గ్రాండ్ గా తెరకేక్కిన్చగా అందులో సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేసింది. అయితే ఈ వెబ్ సీరీస్ షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రోక్షన్ కోసం చూస్తుండగా కరోనా అడ్డం పడింది. ఇక కరోనా ని లెక్క చెయ్యకుండా షూటింగ్స్ కి వెళుతున్నట్టుగానే సమంత తాను నటించిన ఎపిసోడ్స్ డబ్బింగ్ చెప్పడానికి వచ్చేసింది. ఇక ఎప్పుడు చిన్మయి గొంతును అరువు తెచ్చుకునే సమంత తాజాగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కోసం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తన గొంతునే సవరించనున్నట్లుగా తెలుస్తుంది.

Tags:    

Similar News