సమంత బర్త్ డే స్పెషల్

ఈ తరం హీరోయిన్స్ లో పూజ హెగ్డే, రష్మిక పాన్ ఇండియా మూవీస్, బాలీవుడ్ మూవీస్ తో బాగా బిజీగా మారిపోయారు. అంతకుముందు తరం హీరోయిన్స్ లో [more]

Update: 2021-04-28 09:20 GMT

ఈ తరం హీరోయిన్స్ లో పూజ హెగ్డే, రష్మిక పాన్ ఇండియా మూవీస్, బాలీవుడ్ మూవీస్ తో బాగా బిజీగా మారిపోయారు. అంతకుముందు తరం హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్, త్రిష, తమన్నా లాంటి వాళ్ళకి పాన్ ఇండియా ఫిలిమ్స్ తగలకపోయిన.. సౌత్, నార్త్ సినిమాలు చేసేవారు. కానీ సమంత కి ఎన్ని బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినా సమంత సౌత్ ని వదల్లేదు. సౌత్ లో బిజీ గా ఉన్న టైం లో పెళ్లి చేసుకుని సెటిల్ అయినా.. ఇక్కడ బిజీ తారగానే కొనసాగుతుంది. గత ఏడాది పాన్ ఇండియా వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్ లో నటించిన సమంత.. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీతో సత్తా చాటుతుంది.
గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం పాన్ ఇండియా ఫిలిం లో సమంత టైటిల్ రోల్ పోషిస్తుంది. ఇప్పటివరకు సౌత్ సినిమాలతోనే అదరగొట్టేసింది సమంత. ఫస్ట్ టైం శాకుంతలం తో పాన్ ఇండియాలోకి అడుగు పెడుతుంది. అటు తమిళ్ లోనూ టాప్ లో కొనసాగిన సమంత.. ఒకే ఒక్క ఫిలిం తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. కాజల్, తమన్నా, త్రిష లాంటి హీరోయిన్స్ కి దక్కని అపురూపమైన అవకాశం సమంతకి దక్కింది అనే చెప్పాలి. ప్రస్తుతం శాకుంతలం షూటింగ్ లో పాల్గొంటున్న సమంత పుట్టిన రోజు నేడు. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న సమంత కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Tags:    

Similar News