హిట్ కొడితే ఇక టాప్ రేంజే..!

పెళ్లి కాని కాజల్ అగర్వాల్, తమన్నాల కన్నా పెళ్లి తర్వాత కూడా ఓ రేంజ్ క్రేజ్ తో ఉంది సమంత. కాజల్, తమన్నాలు కుర్ర హీరోలతోనూ, మీడియం [more]

;

Update: 2019-04-05 06:40 GMT
samantha career after majili
  • whatsapp icon

పెళ్లి కాని కాజల్ అగర్వాల్, తమన్నాల కన్నా పెళ్లి తర్వాత కూడా ఓ రేంజ్ క్రేజ్ తో ఉంది సమంత. కాజల్, తమన్నాలు కుర్ర హీరోలతోనూ, మీడియం హీరోలతోనూ అడ్జెస్ట్ అవుతుంటే.. సమంత మాత్రం లేడి ఓరియెంటెడ్, అలాగే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో దూసుకుపోతుంది. కాజల్.. బెల్లకొండ సరసన కవచం సినిమాలో గ్లామర్ భామగా నటించింది. ఇక తమన్నా అయితే ఎఫ్ 2లో వెంకీ సరసన గ్లామర్ తో రెచ్చిపోయి నటించింది. అయినా కాజల్ కి, తమన్నాకి పెద్దగా పేరు వచ్చింది లేదు. కానీ సమంత పెళ్లి తర్వాత గత ఏడాది రంగస్థలంలో రామలక్ష్మిగా, మహానటిలో మధురవాణిగా, అభిమన్యుడులో డాక్టర్ లతగా, యూటర్న్ లో రచనగా డిఫరెంట్ పాత్రలతో అదరగొట్టేసింది.

విభిన్న పాత్రలో నటిస్తున్న సమంత

ఇక ఈ ఏడాది మజిలీ సినిమాలో శ్రావణిగా మధ్యతరగతి భార్య పాత్రలో నటించింది సమంత. ఈరోజు విడుదలైన ఈ సినిమాలో సమంత నటనకు 100 శాతం మార్కులు పడడం ఖాయంగా కనబడుతుంది. ఇక నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ అంటూ మరో డిఫరెంట్ పాత్రలో నటించింది. ఆ సినిమా కూడా వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతుంది. ఇక తమిళ రీమేక్ 96లో కూడా సమంత నటిస్తే సమంత రేంజ్ ని ఎవరూ తట్టుకోలేరు. మరి పెళ్లి కాని హీరోయిన్స్ కన్నా ఎక్కువగా పెళ్లైన సమంత సినిమాల జోరు మాములుగా లేదు. ఈరోజు విడుదలవుతున్న మజిలీ హిట్ అయితే సమంత టాప్ రేంజ్ లో మరోసారి బిజీగా అదరగొట్టడం ఖాయం.

Tags:    

Similar News