చైతూ ని అలా పడేసిన సామ్?

సమంత హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరో సిద్దార్ధ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు.. పెళ్లి కూడా చేసుకోబోతుంది అనే రూమర్స్ సోషల్ మీడియాలో [more]

Update: 2021-01-27 10:05 GMT

సమంత హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరో సిద్దార్ధ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు.. పెళ్లి కూడా చేసుకోబోతుంది అనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇద్దరూ కలిసి శ్రీకాళహస్తి గుడిలో రాహు కేతువుల పూజలు చేయించింది కూడా వారి పెళ్ళికి ఉన్న దోషాలు పోవడానికి అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే తర్వాత వాళ్ళకి బ్రేకప్ కూడా అయ్యిపోయింది అన్నారు. ఇక కొన్నేళ్ళకి నాగ చైతన్య తో సమంత ప్రేమాయణం బయటికి రావడంతో అంతలోనే వాళ్ళ ప్రేమ పెళ్లిగా మారడంతో సమంత అక్కినేని ఇంటి కోడళ్ళుగా మారిపోయింది. అయితే నాగ్ చైతన్య తో సమంత మూడు సినిమాల్లో నటించింది కానీ వాళ్ళ మధ్యలో ప్రేమ ఎప్పుడు, ఎలా మొదలయ్యిందో ఎవరికీ క్లారిటీ లేదు. వాళ్ళ పరిచయం ఎలా జరిగింది ఇలా చాలా అనుమానాలు, ఆత్రుత ఉన్నా ఎవరికీ స్పష్టత కూడా లేదు.

అయితే తాజాగా సమంత చైతూని పడెయ్యడానికి తానెన్ని పాట్లు పడ్డానో రివీల్ చేసింది. సమంత నాగ చైతన్యని పడెయ్యాడనికి పెద్ద స్కెచ్చే వేసింది. అది నాగ చైతన్యకి జిమ్ అంటే చాలా ఇష్టమట. ఎప్పుడూ జిమ్ లోనే గడుపుతుంటాడట. అందుకే సమంత కూడా జిమ్ లో జాయిన్ అయ్యిందట. చైతూని పడెయ్యాడనికి తాను మొదటి సారి జిమ్ జాయిన్ అయ్యానంటూ పెద్ద సీక్రెట్ రివీల్ చేసింది. ఆ తర్వాత జిమ్ పరిచయం ప్రేమగా మారింది అని చెబుతుంది సామ్. ఇక నాగ చైతన్య కి సోషల్ మీడియా అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఆ విషయం మీతో పాటు నాకు ఇంట్రెస్ట్.. ఎందుకు చైతూ సోషల్ మీడియాకి దూరం గా ఉంటావ్ అంటూ సమంత చేసిన అల్లరి అంతా కాదు. 

Tags:    

Similar News