ఇంత సైలెంట్ గా పూర్తి చేశారా..?

దాదాపు మూడేళ్లకుపైగా ఖాళీగా ఉన్న డైరెక్టర్ నందిని రెడ్డి… విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో గాని ఆ సినిమా [more]

Update: 2019-03-16 08:28 GMT

దాదాపు మూడేళ్లకుపైగా ఖాళీగా ఉన్న డైరెక్టర్ నందిని రెడ్డి… విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో గాని ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ల లేదు. ఇక లేటెస్ట్ గా సామ్ తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి రెడీ అయింది నందిని. ఇది కొరియన్ మూవీ. ‘మిస్ గ్రానీ’ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ ఇంతవరకు ఈ సినిమా ఆఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అసలు షూటింగ్ ఎప్పుటి నుండి స్టార్ట్ అవుతుందో కూడా ఎక్కడా అప్ డేట్ లేదు.

అప్పుడే షూటింగ్ అయిపోయిందా..?

అయితే సడన్ గా ‘మిస్ గ్రానీ’ రీమేక్ చిత్రీకరణ మొత్తం పూర్తయినట్లు అప్ డేట్ బయటికి వచ్చింది. సమంత, నందిని రెడ్డి టీంతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పెట్టింది. ఈ మూవీకి ఎక్కువ శాతం లేడీస్ పనిచేయడం విశేషం. అసలు సినిమా ఎప్పుడు స్టార్ట్ చేసారో ఎప్పుడు ఎండ్ చేసారు అనేది పెద్ద షాక్. ఈ మూవీని సురేష్ బాబు నిర్మించారు. ఇక ఇందులో సమంత 80 ఏళ్ల ముసలావిడగా, 25 ఏళ్ల కుర్ర అమ్మాయిగా కనిపించనుండటం విశేషం.

Tags:    

Similar News