కథ నచ్చాక.. మళ్ళీ దానిగురించి ఆలోచించను!!
పెళ్లి తర్వాత కూడా రాకెట్ స్పీడు తో టాప్ పొజిషన్ ని నిలబెట్టుకుంటనున్న అక్కినేని సమంత.. ఇప్పటికి హాట్ యాంగిల్స్ తో.. స్పైసి షూట్స్ తో యంగ్ [more]
;
పెళ్లి తర్వాత కూడా రాకెట్ స్పీడు తో టాప్ పొజిషన్ ని నిలబెట్టుకుంటనున్న అక్కినేని సమంత.. ఇప్పటికి హాట్ యాంగిల్స్ తో.. స్పైసి షూట్స్ తో యంగ్ [more]
పెళ్లి తర్వాత కూడా రాకెట్ స్పీడు తో టాప్ పొజిషన్ ని నిలబెట్టుకుంటనున్న అక్కినేని సమంత.. ఇప్పటికి హాట్ యాంగిల్స్ తో.. స్పైసి షూట్స్ తో యంగ్ హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇస్తుంది. అయితే తనకి ఒకప్పుడు తన సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలా భయంగా ఉండేదట. సినిమా విడుదలయ్యే ముందు రోజు రాత్రి చిత్ర బృందాన్ని అసలు నిద్రపోనివ్వకుండా ఫోన్స్ చేసి.. సినిమా హిట్ అవుతుందా? లేదా అంటూ అందరికి నిద్ర కరువు చేస్తుందట. ఇదే విషయాన్ని సమంత స్వయంగా చెబుతుంది. కానీ ఇప్పుడు అంటే కెరీర్ లో ఓ స్టేజ్ కి చేరుకున్నాక అంత ఒత్తిడి తీసుకోవడం లేదంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఒకసారి కథ నచ్చి సినిమా ఒప్పుకున్నాక దాని గురించి ఆలోచించనని.. ఒకవేళ ఆ సినిమా ఫలితం గురించే ఆలోచిస్తే.. సన్నివేశాల్లో నేచురల్ గా నటించడం కష్టం కాబట్టే.. విన్నవెంటనే కథ నచ్చగానే దాన్ని అక్కడే మర్చిపోతా అంటుంది సమంత. ఇక దర్శక నిర్మాతలు చెప్పిన టైం కి సెట్స్ కి వెళ్ళామా? లేదా? దర్శకుడు చెప్పినట్టు నటించామా? లేదా? అనేది చూసుకుంటాను. అంతేకాని సినిమా ఫలితం పై దృష్టి పెడితే… మనం నటించే సన్నివేశం పాడవుతుంది. ఇక సినిమ విషయంలో మన ప్రయత్నం మనం చెయ్యాలి.. మిగతాది ప్రేక్షకులకే వదిలేయాలంటుంది సమంత. ఇక ఎంత ఒత్తిడిని తగ్గించుకుందామనుకున.. సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత టెంక్షన్ ఉంటుంది. అయితే సినిమా ఫలితం పై టెంక్షన్ పడకుండా కూల్ గా ఉండడమనేది చైతు ని చూసి నేర్చుకుంటున్నా అని చెబుతుంది సమంత.