ప్రభాస్ కి షాక్ ఇవ్వనున్న సమంత

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జాన్ అనే సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. సాహో చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అవ్వడంతో తన ఫోకస్ మొత్తం [more]

;

Update: 2019-10-22 09:05 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జాన్ అనే సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. సాహో చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అవ్వడంతో తన ఫోకస్ మొత్తం రాధాకృష్ణ తో చేసే సినిమాపైనే పెట్టాడు ప్రభాస్. ఈ చిత్రం కోసం కొంతవరకు షూటింగ్ కూడా జరిగింది. అయితే రీసెంట్ గా సాహో రిజల్ట్ వేరేలా రావడంతో కథపై మరోసారి కూర్చోవాలంటూ రాధాకృష్ణ ను ఆదేశించాడు ప్రభాస్. మళ్లీ షూటింగ్ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. జనవరి నుంచి ఈ చిత్రం మళ్లీ పట్టాలెక్కుతుందని తెలుస్తుంది.

జానుతో ఎఫెక్టేనా….

ప్రభాస్ కి సమంత షాక్ ఇవ్వనుంది. అది ఎలా అంటే సమంత ప్రస్తుతం తమిళ చిత్రం 96 రీమేక్ లో నటిస్తుంది. దీన్ని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘జాను’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇదే టైటిల్ తో సామ్ వస్తే కచ్చితంగా ప్రభాస్ చిత్రం ‘జాన్’ కి ఎఫెక్ట్ అవుతుంది. ఇద్దరి టైటిల్స్ పలకడానికి ఒకేరకంగా ఉండడంతో సామ్ సినిమాకు ‘జాను’ అనే టైటిల్ పెడితే.. ప్రభాస్ సినిమాకు క్రేజ్ తగ్గిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ముందుగా సమంత సినిమా వస్తుంది కాబట్టి దీనికి క్రేజ్ వస్తుంది. మరి ప్రభాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. కానీ ప్రభాస్ టైటిల్ మార్చే ఆలోచనలో లేనట్టు తెలుస్తుంది.

 

 

Tags:    

Similar News