ఇక ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది : సమంత
కొద్దిరోజులుగా సమంత సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకుంటుందంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఆరోగ్యం కోసమే సమంత..
దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత.. తాజాగా చేసిన ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం సమంత ఖుషి సినిమాలో నటిస్తోంది. అలాగే.. సిటాడెల్ వెబ్ సిరీస్ లోనూ కనిపించనుంది. కొద్దిరోజులుగా సమంత సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకుంటుందంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఆరోగ్యం కోసమే సమంత ఈ నిర్ణయం తీసుకుందని నెటిజన్లు, అభిమానులు అభిప్రాయపడ్డారు. తాజాగా సమంత చేసిన మరో పోస్ట్ వైరల్ అవుతోంది. "మరో మూడు రోజుల్లో ఈ కారవాన్ లైఫ్ పూర్తవుతుంది. అతికష్టమైన ఆరునెలలు గడిచాయి. ఇక దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది" అంటూ సమంత తన సెల్ఫీతో కూడిన స్టోరీని ఇన్ స్టాలో జత చేసింది.
ఈ స్టోరీ చూసిన అభిమానులంతా సమంత ఎంత కష్టంగా షూటింగ్ లలో పాల్గొంటుందో అర్థంవుతుందంటూ ఆ స్టోరీ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. అయితే.. సమంత ముఖంలో మళ్లీ మార్పులు కనిపిస్తున్నాయి. బహుశా మయోసైటిస్ కు మరోసారి చికిత్స తీసుకోవాల్సిన సమయం వచ్చి ఉండొచ్చని కూడా అంటున్నారు. ఏదేమైనా ఆమె త్వరగా కోలుకుని.. పూర్తి ఆరోగ్యంతో తిరిగి సినిమాల్లో నటించేందుకు రావాలని ఆశిస్తున్నారు.