సమంత క్రేజ్ చాలా?

సమంత ప్రస్తుతం పాపులర్ హీరోయిన్. పెళ్లయిన ఏ మాత్రం, క్రేజ్ తగ్గని హీరోయిన్ సమంత. అందుకే సమంత క్రేజ్ చాలు మనకి ఇంకేం అవసరం లేదనుకున్నాడు దిల్ [more]

Update: 2020-02-01 04:34 GMT

సమంత ప్రస్తుతం పాపులర్ హీరోయిన్. పెళ్లయిన ఏ మాత్రం, క్రేజ్ తగ్గని హీరోయిన్ సమంత. అందుకే సమంత క్రేజ్ చాలు మనకి ఇంకేం అవసరం లేదనుకున్నాడు దిల్ రాజు. అందుకే 96 రీమేక్ జానూ ప్రమోషన్స్ పెద్దగా చేయడం లేదు. రేపు శుక్రవారం విడుదల కాబోతున్న జానూ ప్రమోషన్స్ లో ఊపు లేదు. సమంత – శర్వానంద్ జంటగా తెరకెక్కిన 96 రీమేక్ జాను సినిమా కి ప్రేక్షకుల్లోనూ ట్రేడ్ లోను పెద్దగా క్రేజ్ కనబడడం లేదు. తమిళంలో క్లాసిక్ హిట్ అయినా 96 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం అవార్డులు కొల్లగొట్టం కూడా అయ్యింది. అలాంటి సినిమాని తెలుగులో రీమేక్ చేసిన దిల్ రాజు ఆ సినిమాకి పక్క ప్రమోషన్స్ చేస్తే సినిమాకి క్రేజ్ వస్తుంది.

అసలు జానూ సినిమా ఎప్పుడు విడుదల అన్న విషయం కూడా బిసి సెంటర్స్ ఆడియన్స్ కి ఐడియా లేదు. జానూ మల్టిప్లెక్స్ ఆడియన్స్ తప్ప బిసి సెంటర్స్ కి ఎక్కే సినిమా కాదనేది అందరికి తెలుసు. కానీ ప్రమోషన్స్ లో కాస్త వెరైటీ చూపిస్తే ఆ సినిమా అందరికి ఎక్కుతుంది. కానీ దిల్ రాజు కి సినిమా మీద నమ్మకమో.. లేదంటే సమంత టాప్ క్రేజున్న హీరోయిన్ కదా.. ఇంతకన్నా ప్రమోషన్స్ అవసరమా అనుకున్నాడో.. కానీ జానూ సినిమా విషయంలో దిల్ రాజు ఎంత లైట్ గా ఉన్నాడో తెలుస్తుంది. శర్వానంద్ అయితే సోషల్ మీడియాలో తనవంతు గా ప్రచారం చేసుకుంటున్నాడు. అయినా తమిళంలో అంత పెద్ద హిట్ అయినా సినిమాని చాలామంది చూసేసారు… అందుకే జానూ సినిమా విషయంలో ప్రేక్షకులు కూడా లైట్ తీసుకున్నట్టుగా ఉన్నారు

Tags:    

Similar News