సమంత బిజీ అయినా.. వదిలేలా లేదే!!

సమంత ఐదునెలలుగా కరోనా లాక్ డౌన్ తో ఖాళీ సమయాన్ని తన టెర్రస్ మీద సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండించడానికి వెచ్చించింది. తాను పండించిన కూరగాయలతో సోషల్ [more]

;

Update: 2020-09-05 05:36 GMT

సమంత ఐదునెలలుగా కరోనా లాక్ డౌన్ తో ఖాళీ సమయాన్ని తన టెర్రస్ మీద సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండించడానికి వెచ్చించింది. తాను పండించిన కూరగాయలతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న సమంత తాజాగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ డబ్బింగ్ కోసం వెళ్ళింది. అయితే ఖాళీ సమయంలో టెర్రస్ మీద కూరగాయలు పండించిన సమంత ఇప్పుడు బిజీ అయ్యి షూటింగ్స్ కి వెళ్లినా ఆ పంట పండించే పద్దతి వదిలిపెట్టదట. వారాంతంలో ఈ టెర్రస్ వ్యవసాయం చేస్తానని చెబుతుంది. ఇక తాను పండించే పంట గురించి కూడా సోషల్ మీడియా ద్వారా ఏకరువు పెడుతుంది. 

ఇంటి టెర్రస్ పై తాజాగా ముల్లంగి పంట పండించిన సమంత.. ఏదైనా విత్తనాలు నేలలో వేసినప్పుడు దానిని ఎలా వెయ్యాలి, ఎలా పెంచాలో చెబుతుంది. ముందుగా నాటే విత్తనాలు మంచివా లేదా అని చూసి తర్వాత విత్తనాలు నాటాలని, ఆ విత్తనాలు భూమిలోపల ఒకటి రెండు సెంటీమీటర్ల మేర నాటాలని, అలా చేస్తే మంచిగా విత్తనాలు మొలకెత్తుతాయని, విత్తనాలు భూమిలో వేసేటప్పుడు కొద్దిగా నీరు పోయాలని, నీరు ఎక్కువైతే విత్తనాలు మొలవకపోచ్చని చెబుతుంది. ఇక ముందు సూర్య రశ్మి తగలేకపోయినా పర్లేదు కానీ, తర్వాత గాలి వెలుతురూ ఉన్న చోట పెడితే మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయని సేంద్రియ వ్యవసాయంపై ఓ లెక్చర్ ఇస్తుంది సమంత.

Tags:    

Similar News