అక్కినేని కోడలి కష్టాలు చైతుకే తెలియాలి!!

అక్కినేని నాగార్జున కోడలు.. టాప్ హీరోయిన్ మాత్రమే కాదు… టాప్ హోస్ట్ కూడా ఆయ్యింది. హీరోయిన్ గాను, విలన్ గాను, ఇప్పుడు హోస్ట్  గాను సమంత అవతారాలు [more]

;

Update: 2020-11-11 15:20 GMT

అక్కినేని నాగార్జున కోడలు.. టాప్ హీరోయిన్ మాత్రమే కాదు… టాప్ హోస్ట్ కూడా ఆయ్యింది. హీరోయిన్ గాను, విలన్ గాను, ఇప్పుడు హోస్ట్  గాను సమంత అవతారాలు మాములుగా లేవు. ప్రస్తుతం సినిమాలను పక్కనపెట్టినట్టుగా కనబడుతున్న సమంత అక్కినేని అల్లు వారి ఆహా కోసం హోస్ట్ గా మారింది. సామ్ జామ్ అనే టాక్ షోకి హోస్ట్ చెయ్యబోతున్న సమంత ఫస్ట్ గెస్ట్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. అయితే సమంత హీరోయిన్ గా ఉన్నప్పుడు జిమ్ లో ఎంతగా కష్టపడి వర్కౌట్స్ చేస్తుందో.. సినిమాలు చెయ్యకపోయినా.. సమంత జిమ్ కష్టాలు అలానే ఉన్నాయి. రోజు చైతు తో కలిసి జిమ్ చేసే సమంత అప్పుడప్పుడు ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేస్తుంది.

తాజాగా సమంత లాన్ లో వర్కౌట్స్ చేస్తునం వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సమంత ట్రైనర్ ఆధ్వర్యంలో లాన్ లోనే వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడుతుంది. మామూలుగానే 100 కేజీల పైన బరువును అవలీలగా ఎత్తేసే అక్కినేని కోడలు.. ఇప్పుడు లాన్ వర్కౌట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. మరి లాక్ డౌన్ లో అందరిలా తినేసి ఒళ్ళు పెంచకుండా ప్రకృతి వ్యవసాయం, జిమ్ లో వర్కౌట్స్ అంటూ సమంత కష్టాలు పాపం చైతుకే తెలియాలంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఆఫర్స్ వస్తే సినిమాలు కూడా చేస్తా అంటుంది సమంత. మరి సమంత సినిమాలకు ఓకె చెప్పింది.. దర్శకనిర్మాతలు రెడీ కాండీ.. అక్కినేని కోడలికి అవకాశాలు ఇవ్వడానికి. 

Tags:    

Similar News